Adivasi Kikri String Instrument | అరుదైన గిరిజన సంగీత వాయిద్య పరికరం కిక్రీ | ABP Desam
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజ కార్యక్రమాల్లో కిక్రి వాయిద్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ కిక్రి వాయిద్యం కేవలం తమ సాంప్రదాయ కార్యక్రమాల్లోనే వాయించడం అనవాయితీ. ఇంటిపెద్దగా ఉండే వ్యక్తి మాత్రమే వాయించే కిక్రీ వాయిద్యం తీగల ఆధారంగా ధ్వనించే ఓ సంగీత పరికరం. గిరి జనుల కే మాత్రం ప్రత్యేకం గా కనిపించే ఈ వాయిద్యానికి ఎంతో ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఇంటిలో ఉండే ఆడవారు కిక్రీ వాయిద్యం వాయించటానికి అనుమతి ఉండదు. కేవలం మగవారు మాత్రమే ఈ వాయిద్యాన్ని వాడాలి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సంగీత వాయిద్య పరికరం భారతీయ సంగీత గొప్పతనాన్ని చాటి చెప్పేదే. అసలు ఇంతకీ ఈ కిక్రి వాయిద్యాన్ని నాగోబా జాతర సమయం లో మేస్రం వంశీయులు తమ సాంప్రదాయ పూజ కార్యక్రమాల్లో ఎప్పుడూ..ఎలా వాయిస్తారు.. దీని ప్రత్యేకత ఏమిటి ఈ వీడియోలో చూద్దాం.





















