India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇండియా స్క్వాడ్ ను ప్రకటించింది. ఇంజ్యూరీ కారణంగా శుబ్‌మన్ గిల్ కు బ్రేక్ ఇచ్చారు. కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. బుమ్రా, సిరాజ్‌లకు కూడా బ్రేక్ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక బ్యాటింగ్ లైన్ అప్ గురించి పక్కన పెడితే బౌలర్ల విషయంలో బీసీసీఐ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలను సెలెక్ట్ చేసారు. అయితే హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలను సెలెక్ట్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు. ఫార్మ్ లో లేని ప్లేయర్స్ కు కాకుండా వేరే వాళ్లకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
నాలుగో సీమర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ ను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. స్పిన్నర్ల విషయానికి వస్తే.. కుల్దీప్ యాదవ్ మెయిన్ స్పిన్నర్‌గా ఉంటాడు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు స్పిన్ ఆల్ రౌండర్లుగా ఉంటారు. అయితే అక్షర్ పటేల్, సిరాజ్‌లను ఎందుకు పక్కన పెట్టారో తెలీదు. ఈ సిరీస్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలకు చాలా కీలకం. మంచి ప్రదర్శనతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.





















