Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telangana Jagrthi: తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మారుస్తానని కవిత ప్రకటించారు. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు.

Kavitha will turn Telangana Jagruti into a political force: బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. తన సామాజిక సంస్థ 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మారుస్తానని సంచలన ప్రకటన చేశారు. శాసనమండలి వేదికగా కన్నీటి పర్యంతమైన ఆమె, అనంతరం గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
కల్వకుంట్ల కవిత తన సొంత సంస్థ అయిన 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శాసనమండలికి రాజీనామా చేసిన అనంతరం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఆమె ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, ప్రజల గొంతుకగా నిలిచేందుకు ఒక కొత్త రాజకీయ శక్తి అవసరం ఉందని, ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తీసుకుంటుంది అని ఆమె స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. తన రాజకీయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ ఆమె సభలోనే బాధపడ్డారు. "కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి… pic.twitter.com/MfDOUaQzFR
— ABP Desam (@ABPDesam) January 5, 2026
బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కవిత, ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కక్షగట్టే ధోరణి పెరిగిపోయిందని, తనను ఘోరంగా అవమానించి బయటకు పంపారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, తన సొంత పుట్టిన ఇల్లే తనను చిన్నచూపు చూసిందని వాపోయారు. అందుకే ఆత్మగౌరవం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం బంధాలన్నీ తెంచుకుని బయటకు వచ్చినట్లు వివరించారు.
#WATCH | Hyderabad: Telangana Jagruthi founder K Kavitha says, "I have tendered my resignation once again on the floor of the state legislative council. I hope the chairman will accept my resignation. My suspension from the BRS party, in a very insulting manner, has left me with… pic.twitter.com/9Qie0xmzSc
— ANI (@ANI) January 5, 2026
కొత్త పార్టీ విధివిధానాల గురించి మాట్లాడుతూ.. సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, నిరుద్యోగులు తనతో కలిసి నడవాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న జాగృతి జనం బాట యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, త్వరలోనే పార్టీ పేరు, జెండా మరియు అజెండాను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ మహిళలను, నిరుద్యోగులను మోసం చేశాయని కవిత విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకే తాను ఈ అడుగు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం. చట్టసభల్లో తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతాం అని ధీమా వ్యక్తం చేశారు.





















