Viral Video: అభిమానులపై రోహిత్ గుస్సా.. ఆ తర్వాత కూల్ అంటూ థంప్సప్.. అసలేం జరిగిందంటే..?
అభిమానులు సెల్ ఫోన్లో ఫొటోలు క్లిక్ మనిపిస్తూ, కనిపించారు.దీంతో కాస్త అహసనానికి గురైన రోహిత్.. సమైరాను దగ్గరికి తీసుకుని, కారులోకి ఎక్కించాడు. ఆ తర్వాత మరో బాలికను కూడా కారులోకి ఎక్కించాడు.

Rohit Sharma Getting Angry: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చింది. పార్కింగ్ లాట్ లో తనను చుట్టుముట్టిన అభిమానులను చూసి అసహనం వ్యక్తం అయ్యాడు. ఇదెక్కడ జరిగిందో కానీ, తాజాగా ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రకారం.. తన కారు వద్దకు వెళ్లేందుకు కుమార్తె సమైరాతో కలిసి రోహిత నడుచుకుంటూ వస్తున్నాడు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది అభిమానులు సెల్ ఫోన్లో ఫొటోలు క్లిక్ మనిపిస్తూ, కనిపించారు. దీంతో కాస్త అహసనానికి గురైన రోహిత్.. సమైరాను దగ్గరికి తీసుకుని, తనే కారులోకి ఎక్కించాడు. ఆ తర్వాత మరో బాలికను కూడా కారులోకి ఎక్కమన్నాడు. వారిద్దరిని కారులోకి ఎక్కించిన తర్వాత, అభిమానుల వద్దకు వచ్చి కూల్ గా కనిపించాడు. థంప్సప్ సింబల్ చూపిస్తూ, వారితో ఫొటోలు కూడా దిగాడు. తాజాగా ఈ ఉదంతం సోషల్ మీడియాలో హైలెట్ అయింది. అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తూ, షేర్లు, లైకులతో సదరు పోస్టును హోరెత్తిస్తున్నారు.
View this post on Instagram
యువ ఆటగాళ్లకు సందేశం..
ఇక తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, యువ ఆటగాళ్లకు సందేశమిచ్చాడు. యువ ప్లేయర్లు తమలోతాము నమ్మకం ఉంచుకోవాలని హితవు పలికాడు. మెగాటోర్నీకి ఎంపికయ్యారంటేనే వారిలో ఎంత ప్రతిభ దాగి ఉందని, దాన్ని అసలైన వేదికపై నిరూపించుకోవాలని సూచించాడు. అలాగే ఎత్తు పల్లాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదని మరింత ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశముందని తెలిపాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ముంబై జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తీవ్రంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. అయితే గతేడాదిగా పరిస్థితి మారిపోయి, ముంబైకర్లకు ప్రియమైన క్రికెటర్ గా నిలిచాడు.
రెండు ఐసీసీ టోర్నీలలో కీలక పాత్ర..
ముఖ్యంగా గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రారంభమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శనతో హార్దిక్ అదరగొట్టాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు రంగాల్లో సత్తా చాటాడు. ముఖ్యంగా ఫైనల్లో ఆఖరు ఓవర్ వేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు చూపించాడు. ఈక్రమంలో జట్టు విజయం సాధించడంలో కీ రోల్ పోషించాడు. దీంతో ప్రస్తుతం భారత అభిమానులకు చాలా ఇష్టమైన క్రికెటర్ గా మారిపోయాడు. సో.. ఈసారి ఐపీఎల్లో ముంబైని ఎలా నడిపిస్తాడో చూడాలి. ఈసారి ఐపీఎల్ ఈనెల 22న ప్రారంభమవుతుండగా, ఈనెల 23న చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలోనే తన తొలి మ్యాచ్ ను ముంబై ఆడనుంది. ఇరుజట్లు ఐపీఎల్లో చెరో ఐదు ట్రోఫీలతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

