Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
TDP: గతంలో తెలుగుదేశం పార్టీ తన వల్లే ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. తమను ఎవరూ ఓడించలేదని చెప్పుకొచ్చారు.

Telugu Desam Party : తెలుగుదేశం పార్టీని 2004, 23019లో ఎవరూ ఓడించలేదని .. తన వల్లే పార్టీ ఓడిపోయిందని చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కొన్ని పనుుల చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఓటమికి కారణం అయింది. ప్రజా సమస్యలను పరిష్కరిస్తే.. ఎప్పటికీ ఓటమి రాదన్నారు. 2004. 2019 రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన సంవత్సరాలు. రెండు సార్లు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. 2004లో మూడో సారి టీడీపీ గెలుపు ఖాయమని అతి విశ్వాసంతో ఉన్నారు కానీ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ పట్టం కట్టారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఐదేళ్లు పరిపాలన తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. తాము ఏం తప్పు చేశామని..రాజధానిని నిర్మించడానికి పునాదులు వేయడమే కాకుండా.. పన్నులు పెంచకుండా పరిపాలన చేశామని.. అభివృద్ధి పరుగులు పెట్టించామని అయినా ఓడించారని చంద్రబాబు కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ రెండు సందర్భాలలోనూ తాను చేసిన తప్పులేమిటో గుర్తించినట్లుగా మాట్లాడుతున్నారు.
టీడీపీ అధకారంలోకి పస్తే పార్టీని పట్టించుకోని చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే.. పూర్తిగా పార్టీని నిర్లక్ష్యం చేసి.. పాలనపై దృష్టి పెడుతుందని అభివృద్ధి కోసమే పూర్తి సమయం కేటాయించడం వల్ల పార్టీ క్యాడర్ పై పట్టు కోల్పోవడం జరుగుతుందని చివరికి.. అది పార్టీ ఓటమికి కారణం అవుతుందని టీడీపీ నేతలు మొదటి నుంచీ చెబుతూ ఉంటారు ఇటీవల జిల్లాల పర్యటనలకు వెళ్తున్న చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీని ఓవరూ ఓడించలేరని.. టీడీపీ కార్యకర్తలు అసంతృప్తికి గురై.. పార్టీ కోసం పని చేయకుండా ఉన్నప్పుడే పరాజయం ఎదురవుతుందని చెప్పారు. అయితే టీడీపీ కార్యకర్తలు పసుపు రక్తంతో ఉంటారని వేరే పార్టీకి వెళ్లరని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షంలో ఉంటే పోరాటంతో సులువుగానే అధికారం
చంద్రబాబు మాటల్లో ఎంత నిజం ఉందో కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శక్తివంచన లేకుండా పోరాడి సులువుగానే అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ. కానీ అదికారంలో ఉన్నప్పుడు మాత్రం.. రాజకీయం పూర్తి స్థాయిలో చేయలేక తదుపరి ఎన్నికల్లో చదికిల పడుతుంది. ఒక్క 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ వరుస విజయాలు సాధించింది. ఆ తర్వాత అధికారం వస్తే ఐదేళ్లకు మళ్లీ కోల్పోతున్నారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు తాను చేస్తున్న తప్పులేమిటో గమనించి ఉంటారని.. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు తప్పులు తెలుసుకుంటారా ?
చంద్రబాబు తన తప్పులేమిటో గుర్తించారని.. ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారిని భావిస్తున్నారు. పరిపాలనతోనే కాదు.. పార్టీ పరమైన అంసాల్లోనూ చంద్రబాబులో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ సారి పొలిటికల్ రూలింగ్ ఉంటుందని చెప్పారని అలాంటి రూల్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

