అన్వేషించండి

Tirupati News: తిరుపతిలో చిరుత సంచారంతో కలకలకం, వేదిక్ వర్సిటీలో కనిపించడంతో టెన్షన్ టెన్షన్

Cheetah Spotted in Tirupati | వేదిక విశ్వవిద్యాలయంలో చిరుతలు సంచరించడం కలకలం రేపుతోంది. కుక్కలు, జింకలు దొరుకుతాయని చిరుతలు యూనివర్సిటీ పరిధిలోని స్థలంలో సంచరిస్తున్నాయి.

తిరుపతి: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర, వేదిక్, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా చిరుతలను బంధించకపోవడం ఆందోళన పెంచుతోంది. రాత్రి వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత సేదతీరుతూ విద్యార్థుల కంటపడింది. 3 నెలలు అవుతున్నా చిరుతలను పట్టుకోలేకపోతున్నారని.. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ తిరుగుతున్నారు. కుక్కలు, దుప్పిలు, జింకలు కోసం చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సమాచారం. అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది మరింత చొరవ తీసుకుని చిరుతలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.

గాలిగోపురం సమీపంలో చిరుత సంచారం..

అలిపిరి నుంచి తిరుమలకు ఉన్న కాలినడక మార్గం మధ్యలో ఇటీవల చిరుత సంచరించడం కొందరు చూశారు. అర్ధరాత్రి సమయంలో గాలిగోపురం సమీపంలోని దుకాణం ఎదురుగా రోడ్డుపై చిరుత కనిపించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. అంతకుముందు ఇదే నెలలో ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించి దానిని తిరిగి అడవిలోకి పంపించేశారు. తిరుమలకు వచ్చే కాలినడక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యం పర్యవేక్షిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. 

ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారంపై హెచ్చరిక
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరులపులి సంచరిస్తోంది. కనుక రాత్రిపూట ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది, పాదచారలు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సిటీ ఆవరణలో వ్యర్థ ఆహార పదార్థాలు వేయడం వలన కుక్కలు, అటవి జంతువులు జింకలు, దుప్పిలు లాంటివి వస్తున్నాయి. వీటి కోసం చిరుత పులులు వస్తున్నాయి. కనుక రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీ రోడ్డుపైన సంచరించడంపై నిషేధం ఉంది. ఇది అతిక్రమిస్తే జరిగే పరిణామాలకు ఎస్వీ యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని హెచ్చరికలో బోర్డులో పేర్కొన్నారు. అత్యవసరమైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ను సంప్రదించాలని వారి కాంటాక్ట్ నెంబర్స్ ఫ్లెక్సీలో ఇచ్చారు.

భక్తులకు టీటీడీ కీలక సూచనలు, జాగ్రత్తలు..

వారంలో రెండు, మూడుసార్లు చిరుతలు కనిపిస్తున్నాయని ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చిరుతల సంచారంరతో తిరుమల నడకమార్గంలో  టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గస్తీని పెంచింది. నడకమార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ జాగ్రత్తలు సూచించింది. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5  నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తున్నారు. ఆ తరువాత భక్తులను గుంపులు గుంపులుగా దర్శనానికి అమనుతిస్తున్నారు.

12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి దర్శనానికి అనుమతించడం లేదని సమాచారం. భక్తులను ఒక్కసారి 70, 80 మందిని, లేక 100 మంది వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. గుంపులుగా ఉంటే చిరుత దాడి చేసే అవకాశాల తక్కువ ఉంటాయని టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అలిపిరి నడక మార్గాన్ని రాత్రి 9.30 గంటల తర్వాత మూసివేయనున్నారు. భక్తులు ఈ విషయాలు తెలుసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget