AP Pensions: పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్
Andhra Pradesh News | పింఛన్ల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెడుతూ కొత్త స్కానర్లను కొనుగోలు చేసింది.

Biometric Fingerprint Device | అమరావతి: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కంపెనీలో తలెత్తుతున్న ఇబ్బందులకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. పెన్షన్లు (AP Pensions) సమయంలో వేలిముద్రలు సరిగా పడక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుంటారు. దాంతో వచ్చే నెల నుంచి పింఛన్ల కోసం కొత్త స్కానర్ లను ప్రభుత్వం తీసుకు రానుంది. పింఛన్ల పంపిణీ సమయంలో ప్రస్తుతం L-0 స్కానర్ ద్వారా వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇకనుంచి ఎల్0 స్కానర్ల స్థానంలో ఎల్ 1 స్కానర్లను ప్రభుత్వం వినియోగించనుంది. దాదాపు 2000 రూపాయలు ఖర్చుపెట్టి ఒక్కో స్కానర్ పరికరాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
యు ఐ డి ఏ ఐ (UIDAI) ఆధార్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడంతో పాత పరికరాలు ఉపయోగించడానికి వీలుండదు. ఈనెలాఖరు తర్వాత పాత స్కానింగ్ పరికరాలు పనిచేయవని సంస్థ ఇదివరకే తెలిపింది. దాంతో ఏపీ ప్రభుత్వం కొత్త స్కానర్లు కొనుగోలు చేసింది. వీటిని ఏపీలోని 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందించనుంది. దాంతో పింఛను లబ్ధిదారులకు వేలిముద్రల సమస్య తీరనుంది. తొలిరోజే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
64 లక్షల మందికి పింఛన్లు
పాత నెల చివరి రోజు లేక కొత్త నెలలో తొలిరోజే ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తోంది. రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2000 చేసింది తానేనని చంద్రబాబు అన్నారు. కానీ హామీ ఇచ్చి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల్ని ఏడిపించి ఏడిపించి ఐదేళ్లకు వెయ్యి పెంచి రూ.3000 ఫించన్ చేసిందన్నారు. ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ.4000కు పెంచాం. ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా అందించాం అన్నారు. దివ్యాంగులకు రూ.500 నుంచి పింఛన్లు ఇప్పుడు రూ.6000 చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించాం అన్నారు. 8 లక్షల మందికి నెలకు రూ.6 వేలు ఇస్తున్నాం. దేశంలో అధికంగా పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు.
ఫేక్ పింఛన్ దారుల ఏరివేతపై ప్రభుత్వం ఫోకస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేక్ పెన్షనర్లకు ఏరివేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 18,036 మంది పింఛన్లను చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించింది. జనవరిలో 63,77,943 మందికి పింఛన్ పంపిణీ చేయగా, ఫిబ్రవరిలో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరిలో 63,59,907 మందికి పింఛన్ అందించింది. పింఛన్ల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన వారికి దివ్యాంగ పింఛన్లు రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు పొందుతున్నారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. కొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో పరిశీలించిన కూటమి ప్రభుత్వం 18 వేల మందికి పింఛన్ తొలగించినట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 33 వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

