అన్వేషించండి

Save Keyans Advik: ఏపీలో మరో ఎస్‌ఎంఏ కేసు! 16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం కేయాన్స్ అద్విక్ ఎదురు చూపు!

Save Keyans Advik: స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనేది కండరాల క్షణతకు దారి తీసే ఒక తీవ్రమైన జన్యుపరమైన రుగ్మత. ఇది శరీరంలోని కండరాలను నియంత్రించే నరాల కణాలను దెబ్బతీస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మూడేళ్ల కేయాన్స్ అద్విక్ అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు.
  • స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2 వ్యాధి బారిన పడ్డాడు.
  • చికిత్సకు రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అవసరం.
  • తల్లిదండ్రులు, దాతలు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

Save Keyans Advik: అల్లారుముద్దుగా పెరుగుతూ, గిల్లికజ్జాలతో ఇల్లంతా సందడి చేయాల్సిన ఆ మూడేళ్ల పసికందు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోంది. కల్మషం తెలియని ఆ నవ్వుల వెనుక ఒక అరుదైన జన్యు వ్యాధి దాగి ఉందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి చెందిన నటరాజ్‌, శైలజ దంపతుల కుమారుడు కేయాన్స్‌ అద్విక్‌ ఒక అరుదైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. 

సాధారణ పిల్లల్లాగే ఎదుగుతున్నాడని భావించిన కేయాన్స్‌లో కొన్ని శారీరక మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి స్పష్టత కోసం వారు పడని పాట్లు లేవు. తొలుత బత్తలపల్లి, ఆపై పుట్టపర్తిలోని ఆసుపత్రుల్లో చూపించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అక్కడి వైద్యులు సూచన మేరకు బెంగళూరులోని ప్రతిష్టాత్మక నిమ్హాన్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించారు, చివరకు నిర్దారణ కోసం బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రికి తరలించి మరిన్ని టెస్ట్‌లు చేశారు. ఇటీవల వెలువడిన ఆ రిపోర్టులు ఆ కుటుంబంపై పిడుగులా పడ్డాయి. కేయాన్స్‌ అద్విక్‌ స్పైనల్ మస్కులర్‌ అట్రోఫీ టైప్‌-2 అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు ధ్రువీకరించారు. 

ఏంటీ ఎస్‌ఎంఏ టైప్‌-2

స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనేది కండరాల క్షణతకు దారి తీసే ఒక తీవ్రమైన జన్యుపరమైన రుగ్మత. ఇది శరీరంలోని కండరాలను నియంత్రించే నరాల కణాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల చిన్నారి కూర్చోవడం, నిలబడటం, కనీసం ల నిలపడం వంటివి కూడా చేయలేని స్థితికి చేరుకుంటారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కేయాన్స్ ప్రస్తుతం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాడు. 

రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం ఎదురు చూపు

ఈ అరుదైన వ్యాధి నుంచి కేయాన్స్‌ ను కాపాడటానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందుగా పేరున్న ఏవీఎక్స్‌ ఎస్‌ 101 లేదా జోల్గెన్‌స్మా ఇంజెక్షన్‌ ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ ఒక్క ఇంజెక్షన్‌ ధర అక్షరాలా 16 కోట్ల రూపాయలు. దురదృష్టవశాత్తూ ఈ ఔషధం భారత్‌లో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నంచి ప్రత్యేకంగా దిగుమతి చేయాలి. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి ఈ మొత్తం ఊహకందని భారం. 

తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం

చిన్నపాటి ఉద్యోగాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న నటరాజ్, శైలజకు ఈ 16 కోట్ల రూపాయల ఖర్చు అందని ద్రాక్షలా మారింది. మా బిడ్డ కళ్లముందే నీరసించిపోతుంటే చూడలేకపోతున్నామని ఆ ఇంజెక్షన్‌ ఇప్పిస్తే మా బిడ్డ మాకు దక్కుతాడని తెలుసు, కానీ అంత స్తోమత మాకు లేదని అంటున్నారు. తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా, అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం తమ వల్ల కాదని, దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. 

ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కానీ ఈ ఇంజెక్షన్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దాతలు సోషల్ మీడియా వేదికగా కేయాన్స్ పరిస్థితిని వివరిస్తూ విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

మీరు సహాయం చేయాలనుకుంటే 

కేయాన్స్ అద్విక్ ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రతి రూపాయి ఎంతో విలువైనది. మానవతా దృక్పథంతో స్పందించే వారు ఈ కింది బ్యాంక్ వివరాల ద్వారా లేదా, ఫోన్‌పే నంబర్ల ద్వారా ఆర్థిక సహాయం చేయవచ్చు. 

బ్యాంకు ఖాతా పేరు- ఎం శైలజ 

బ్యాంకు పేరు- ఏస్‌బీఐ, హిందూపురం బ్రాంచ్

అకౌంట్ నెంబర్- 32029137877
'ఫోన్‌పే నెంబర్లు-7795576806, 9618339438  

Frequently Asked Questions

కేయాన్స్ అద్విక్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?

కేయాన్స్ అద్విక్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2 అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది కండరాల క్షీణతకు దారితీస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధి వల్ల పిల్లలు కూర్చోవడం, నిలబడటం వంటివి చేయలేరు. చికిత్స చేయకపోతే ఊపిరితిత్తుల పనితీరు తగ్గి, ప్రాణాపాయం కలగవచ్చు.

కేయాన్స్‌కు చికిత్స కోసం ఏ మందు అవసరం?

కేయాన్స్‌కు చికిత్స కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏవీఎక్స్‌ ఎస్‌ 101 (జోల్గెన్‌స్మా) ఇంజెక్షన్ అవసరం. దీని ధర 16 కోట్ల రూపాయలు.

ఈ ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులో ఉందా?

లేదు, ఈ ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకోవాలి.

కేయాన్స్‌ కుటుంబం సహాయం కోసం ఎవరిని సంప్రదించమని కోరుతోంది?

కేయాన్స్‌ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి, కేంద్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు, మరియు దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget