అన్వేషించండి

16 crore injection: 16 కోట్ల ఇంజెక్షన్ - పసిబిడ్డల ప్రాణం నిలిపే జన్యు అద్భుతం .. అసలేమిటీ SMA ?

Genetic miracle: రూ.16 కోట్ల ఇంజక్షన్ గురించి ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. ప్రాణాంతక వ్యాధికి విరుగుడుగా జోల్‌జీన్‌స్మా పని చేస్తుంది. ఒకే ఒక్క డోస్‌తో పునర్జన్మ లభిస్తుంది.

Genetic miracle that saves the lives of infants:  వైద్యశాస్త్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన చికిత్స జోల్‌జీన్‌స్మా ఇంజెక్షన్ వార్తలు తరచూ కనిపిస్తున్నాయి.  కేవలం కొన్ని గ్రాముల ద్రవం ఉండే ఈ ఇంజెక్షన్ ధర అక్షరాలా  16 కోట్ల రూపాయలు . ఇంత భారీ ధర వెనుక ఉన్న కారణం ఏమిటి? అసలు ఇది శరీరంలోకి వెళ్ళాక ఎలాంటి  మ్యాజిక్  చేస్తుంది? . ఇది కేవలం ఒక మందు మాత్రమే కాదు, ఇది ఒక అత్యంత సంక్లిష్టమైన జన్యు మార్పిడి చికిత్స. 

 అసలేమిటి ఈ SMA వ్యాధి? 

 స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA అనేది ఒక అరుదైన జన్యుపరమైన సమస్య. మన శరీరంలోని కండరాలు కదలాలన్నా, మనం శ్వాస తీసుకోవాలన్నా వెన్నుపాములోని మోటార్ న్యూరాన్లు  అనే నరకణాలు కీలకం. ఈ కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో SMN1  అనే జన్యువు ఉండాలి. ఈ జన్యువు లోపించిన పిల్లల్లో కండరాలకు మెదడు నుంచి సంకేతాలు అందవు. ఫలితంగా బిడ్డ కాళ్లు, చేతులు పడిపోవడమే కాకుండా, చివరకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమై రెండేళ్ల లోపే ప్రాణాపాయం సంభవిస్తుంది.

శరీరంలో  డిఎన్ఏ సాఫ్ట్‌వేర్  అప్‌డేట్! 

ఈ 16 కోట్ల ఇంజెక్షన్ శరీరంలో ఒక  బయోలాజికల్ ఇంజనీర్ లా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఒక హాని చేయని వైరస్‌ను వాహనంగా వాడుకుని, దాని లోపల ఆరోగ్యకరమైన  SMN1 జన్యువును అమర్చి బిడ్డ శరీరంలోకి పంపిస్తారు. సెలైన్ ద్వారా ఈ ఔషధాన్ని రక్తంలోకి ఎక్కించినప్పుడు, అది నేరుగా వెన్నుపాములోని నరకణాల కేంద్రకంలోకి వెళ్లి, లోపించిన జన్యువును అక్కడ ఇన్‌స్టాల్  చేస్తుంది. ఇది సరిగ్గా కంప్యూటర్‌లో పాడైపోయిన సాఫ్ట్‌వేర్‌ను కొత్త వెర్షన్‌తో అప్‌డేట్ చేసినట్లే ఉంటుంది.

ఎందుకింత భారీ ధర? 

ఒక్క ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉండటం వెనుక దశాబ్దాల కఠిన పరిశోధన దాగి ఉంది. ఈ మందును కనిపెట్టడానికి కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తాయి. పైగా ఈ వ్యాధి చాలా అరుదుగా లక్షల్లో ఒకరికి వస్తుంది కాబట్టి, ఆ పరిశోధన వ్యయం మొత్తం తక్కువ మంది రోగులపైనే పడుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం, పన్నులు,   అత్యంత సున్నితమైన లాజిస్టిక్స్ వంటి కారణాల వల్ల దీని ధర సామాన్యులకు అందని స్థాయికి చేరుకుంది.

 తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల పోరాటం 

మన దేశంలో ఇప్పటివరకు సుమారు 90 మందికి పైగా చిన్నారులు ఈ చికిత్స పొందారు. విశాఖకు చెందిన ఖ్యాతి, దియా వంటి చిన్నారుల కోసం కోట్ల రూపాయల విరాళాలు సేకరించడం మనం చూశాం. అయితే అందరూ అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి,  నోవార్టిస్  వంటి కంపెనీలు నిర్వహించే లక్కీ డ్రా  మేనేజ్డ్ యాక్సెస్ ప్రోగ్రామ్  ద్వారా కొందరు అదృష్టవంతులు ఉచితంగా ఈ మందును పొందుతున్నారు. మిగిలిన వారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

 కాలమే అత్యంత కీలకం

ఈ చికిత్సలో సమయం అనేది చాలా ముఖ్యం. వ్యాధి లక్షణాలు బయటపడి, నరకణాలు పూర్తిగా చనిపోకముందే  సాధారణంగా రెండేళ్ల లోపు ఈ ఇంజెక్షన్ ఇస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. చనిపోయిన నరాలను ఇది తిరిగి బతికించలేదు కానీ, ఉన్నవాటిని కాపాడి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అందుకే గర్భధారణ సమయంలో లేదా బిడ్డ పుట్టిన వెంటనే జన్యు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇటువంటి సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget