Ideas of India 2026: ఉత్తమ చర్చలు, సాహసోపేతమైన ఆలోచనలు సమాజంపై గొప్ప ప్రభావం చూపిస్తాయి - ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌పై నారా లోకేష్ ట్వీట్
Ideas of India Summit Nara Lokesh: ముంబైలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరగనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ లో నారా లోకేష్ పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేశారు.

ABP Ideas of India Summit 2026 Nara Lokesh: ముంబైలో జరగనున్న ఏబీపీ నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఐదో ఎడిషన్ కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో గ్రాండ్ హయత్ హోటల్‌లో జరగనున్న ఈ రెండ్రోజుల సదస్సులో ఈ ఏడాది "The New World Order" అనే అంశంపై చర్చాగోష్టులు సాగనున్నాయి. దేశ విదేశాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ వేదికపై తమ ఆలోచనలను పంచుకోనున్నారు.
ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఫిబ్రవరి 27 శనివారం నాడు జరగనున్న కీలక సెషన్‌లో ఆయన పాల్గొంటున్నారు. గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ తో కలిసి లోకేష్ ఒక ఫైర్ సైడ్ చాట్ లో పాల్గొనబోతున్నారు. యువ నాయకత్వం , పాలనా పరమైన అంశాలపై వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగనుంది.
ఈ చర్చా కార్యక్రమానికి "The Challenge of Good Governance" సుపరిపాలనలో సవాళ్లు అనే అంశాన్ని ఎంచుకున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ , గుజరాత్‌లలో అమలవుతున్న వినూత్న పాలనా విధానాలు, సాంకేతికత వినియోగం, ప్రజలకు చేరువగా సేవలను అందించడంలో ఎదురవుతున్న సవాళ్లపై ఈ ఇద్దరు యువ నేతలు తమ అనుభవాలను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించనున్నారు.
I’m excited to be part of the ‘Ideas of India’ Summit by ABP News this Saturday, 27th Feb at Mumbai!
— Lokesh Nara (@naralokesh) February 25, 2026
Looking forward to an engaging fireside chat with my friend and deputy CM of Gujarat Harsh Sanghavi ji on “The Challenge of Good Governance.”
Great conversations. Bold ideas.… pic.twitter.com/5pvQf292e9
ఈ సమ్మిట్ గురించి లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నా మిత్రుడు హర్ష్ సంఘ్వీతో కలిసి సుపరిపాలనపై చర్చించబోతుండటం సంతోషంగా ఉంది. ఉత్తమమైన సంభాషణలు, సాహసోపేతమైన ఆలోచనలు సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి అని ట్వీట్ చేసారు.
భారతదేశపు అతిపెద్ద మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటైన ఏబీపీ (ABP) నెట్‌వర్క్, తన ప్రతిష్టాత్మక వార్షిక సదస్సు Ideas of India ఐదవ ఎడిషన్‌ను ఫిబ్రవరి 27 మరియు 28 తేదీల్లో ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో నిర్వహిస్తోంది. ఈ రెండ్రోజుల సదస్సులో రాజకీయ, సినిమా, సామాజిక మరియు విద్యా రంగాలకు చెందిన అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొనబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శశి థరూర్ , ప్రొఫెసర్ జాన్ మీర్‌షైమర్ , పొలిటికల్ సైంటిస్ట్ యాన్ జుయెటాంగ్, మాజీ రా చీఫ్ ఏ.ఎస్. దులత్, పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్ అసద్ దురానీ, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, అర్మాన్ మాలిక్, నటులు ఇషాన్ ఖట్టర్, సునీల్ శెట్టి, అడివి శేష్, మృణాల్ ఠాకూర్, రోనీ స్క్రూవాలా , అమితాబ్ కాంత్ వంటి వారు పాల్గొంటున్నరాు.
ఈ అద్భుతమైన మేధో మథనాన్ని వీక్షించాలనుకునే వారు ABP Live వెబ్‌సైట్, యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం (Live Stream) ద్వారా చూడవచ్చు. మరింత సమాచారం కోసం https://www.abpideasofindia.com/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.























