అన్వేషించండి

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

Ontimitta Kodandarama Swami Temple: ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

Ontimitta Kodandarama Swami Temple:  కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర

పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో, సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే  ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కి ఉన్నందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

ఆలయంలోని శాసనాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. అంతరాలయం, రంగమండపం, మహా ప్రాంగణం, గోపురాలు వంటి నిర్మాణాలు ఈ కాలంలో నిర్మితమయ్యాయి.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

ఎందరో కవులకు నిలయం ఒంటిమిట్ట

ఒంటిమిట్ట క్షేత్రం ఎన్నో మంది మహాకవులకు ప్రేరణనిచ్చిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. మహాకవి శ్రీ పోతన మాత్యులు ఇక్కడే భావగవతాన్ని రచించారని విశ్వసిస్తారు. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీర శతకం రచించి అంకితం చేశారు. రామభద్రకవి రామాభ్యుదయం రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని అనుగ్రహంతో వరకవిగా ప్రసిద్ధి పొందారు. ఉప్పుగుండూరు వేంకటకవి దశరథరామ శతకం రచించారు. ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణంను రచించారు. తాళ్లపాక అన్నమయ్య శ్రీరాముని మహిమను కీర్తిస్తూ అనేక సంకీర్తనలు ఆలపించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండగా, 2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేపడుతోంది.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

శ్రీ సీతారాముల కల్యాణం వైభవం

ప్రతి ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అర్చకులు భగవత్ ప్రార్థనతో ప్రారంభించి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  తదుపరి వస్త్ర సమర్పణ, మధుపర్కం, మహాసంకల్పం, కన్యాదానం జరుగుతాయి. అనంతరం జీలకర్ర–బెల్లం, మాంగల్యపూజ, అక్షతారోపణం, మాలపరివర్తనం వంటి మంగళకార్యాలు నిర్వహించి వేదాశీర్వాదాలతో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా ముగుస్తుంది. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ అందజేస్తుంది.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget