AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Volunteers system in Andhra Pradesh | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని.. వైసీపీ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

Volunteers system no longer in operation in Andhra Pradesh | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో అధికార కూటమి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలుగా పరిస్థితి తయారైంది. వాలంటీర్ల తొలగింపు ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్సీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు కి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేడు వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి సీ ఎఫ్ ఎం ఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి, వారిని రోడ్డు పడేసింది.
ఎన్నికల సమయంలో హామీ ఎలా ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్సీలు
వాలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. 2023 ఆగస్టు నుండి రాష్ట్రంలో వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యవస్థ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారు. 2024 ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని వరుదు కళ్యాణి నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు. ఏకంగా 2.6 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేయడం అన్యాయం అన్నారు. వాలంటీర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అన్యాయం చేయకూడదని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. వలంటీర్లు లేకపోతే విపత్తు శాఖ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వాలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా వినియోగించారని నిలదీశారు.
Also Read: AP Cabinet Meeting: నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
ధరలు, ఛార్జీలు పెంచేది వాళ్లే.. ధర్నాలు చేసేది వాళ్లే
కరెంట్ ఛార్జీలు పెంచింది వాళ్లే.. ధర్నాలు చేసేది వైసీపీ వాళ్లే, ప్రైవేట్ కాలేజీలలో పీజీ చదివే వారికి ఫీజు చెల్లించడం లేదని వైసీపీ హయాంలో 2020లో జీవో కూడా తెచ్చారు. కానీ మేం అందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్ మెంట్ లో 640 కోట్లు బకాయిలు పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజులు చెల్లించుకోలేక చదువుకు దూరమయ్యారు. వైసీపీ హయాంలో నేతల్ని ప్రశ్నించే స్వేచ్చ లేకపోవడంతో ప్రభుత్వాన్ని అడగలేకపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

