Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Neopolis: కోకాపేట నియోపొలిస్‌లో ఎకరం భూమి 137 కోట్లు పలికింది. పలు ప్లాట్లకు వేలం జరుగుతోంది

Kokapeta Neopolis Land Auction: హైదరాబాద్‌లో భూమి బంగారంగా మారిందని మరోసారి నిరూపితమయింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లోని నియోపొలీస్ లేఅవుట్‌లో HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఒక ఎకరం భూమికి రికార్డు ధరగా రూ.137.25 కోట్లు పలికింది. మొత్తం 9.90 ఎకరాల ప్లాట్‌ను రూ.1,355.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
కోకాపేటలో రెండు పెద్ ప్లాట్ల వేలం
కోకాపేట్ వేలంలో మొదటి రౌండ్‌లో రెండు ప్లాట్‌లు అమ్ముడయ్యాయి. ప్లాట్ నంబర్ 17 .. 4.59 ఎకరాలు ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నంబర్ 18 ... 5.31 ఎకరాలు ఉంటుంది. ఎకరానికి రూ.137.25 కోట్లకు విక్రయమయ్యాయి. మొదటి బిడ్ కనీస ధర రూ.99 కోట్లు నిర్ధారించిన HMDA డైరెక్ట్ బిడింగ్ నిర్వహించింది. ఈ లేఅవుట్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, దీని అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేశారు.
నిోయపొలిస్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు
నియోపొలీస్ లేఅవుట్‌లో 45 మీటర్ల వెడల్పు రోడ్లు, సైక్లింగ్ ట్రాక్‌లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ హా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్నదానిపై పరిమితి లేదు. ఫ్లోర్స్ పైకి లిమిట్ లేకపోవడంతో, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్ట్ ORRకు 2 కి.మీ. దూరంలో, రాయదుర్గం IT కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉందది.
2023లో కరం భూమి రూ.100.75 కోట్లు - ఇప్పుడు రూ.137 కోట్లు
2023లో కోకాపేట్‌లో ఒక ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈసారి ఆ రేటును మించి వచ్చింది. హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో కొత్త మైలురాయిగా భావిస్తున్నారు. HMDA మొత్తం వేలాల నుంచి రూ.5,000 కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తోంది. కోకాపేట్ నియోపొలీస్ ప్లాట్‌లకు రూ.99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్‌లకు రూ.75 కోట్లు కనీస ధరలు నిర్ధారించారు. మిగిలిన ప్లాట్‌ల వేలాలు నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలు కూడా రికార్డు ధరలు వస్తాయని HMDA అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లకు వేలం
గత నెలలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో TSIIC నిర్వహించిన ఈ-వేలంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములు రూ.3,135 కోట్లకు అమ్ముడయ్యాయి. ఎకరానికి రూ.177 కోట్లు చేరిన ఈ ధర, తెలంగాణ చరిత్రలో అత్యధికమైంది. హై-టెక్ సిటీ మధ్యలో ఐటీ కంపెనీల మధ్య ఉండటంతో ఈ భూమి కోసం డెవలపర్లు, పెట్టుబడిదారులు పోటీ పడ్డారు. ఆ జోరును కొనసాగిస్తూ.. మరిన్ని భూముల వేలం వేస్తున్నారు.





















