అన్వేషించండి

Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్

Kavitha: బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

Kavitha gives strong warning to BRS leader Niranjan Reddy:  నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు.  తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నా. ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తిలో పర్యటించారు.అక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.   ఇక్కడి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటోందని.. మూడు, మూడు సార్లు 32 మంది బీసీల పై అన్యాయంగా కేసులు పెట్టించాడన్నారు. 

నిరంజన్ రెడ్డి  మూడు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. కష్ం చేసి కట్టుకుంటే సరే...కృష్ణా నదిని కబ్జా చేసి కట్టుకున్నారన్నారు. ఈ విషయం కేసీఆర్ గారి తెలియదా? హరీష్ రావు గారు తన మనిషి అని కేసీఆర్ గారికి తెలియకుండా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంజన్ గారి అరాచకాలు ఘోరతి ఘోరంగా ఉన్నాయని చిన్నపిల్లాడిని అడిగిన చెబుతున్నారని.. ఇలాంటి వ్యక్తి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరు ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు. కేసీఆర్ గారికి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పేనన్నారు. 
 
వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా? ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు. కానీ మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పాత వాటికే కనెక్ట్ చేసి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవటం సరికాదు. పెబ్లేరు సంత చాలా ఫేమస్. అక్కడ 32 ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వనపర్తి, పెబ్బేరు ఎక్కడైనా కబ్జాలేనా? నిరంజన్ రెడ్డి గారి భూదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు. 

ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయవద్దని..ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బతికి బట్టకట్టదన్నారు. హరీష్ రావు మనిషి కాబట్టే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవటం లేదన్నారు. నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేద్నారు.  మీ అరాచకాలు కేసీఆర్ గారి తెలియవని అనుకుంటున్నా. అందుకే మీడియా ద్వారా చెబుతున్నానన్నారు. ఇలాంటి వాళ్లను ప్రజల మీదకు రుద్దటం అన్యాయమన్నారు. 

తెలంగాణ తెచ్చుకున్నదే బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి లాంటి ప్రాజెక్ట్ లు పూర్తి చేయటానికి. కానీ ఇప్పుడు వరకు అది జరగలేదన్నారు. 2004, 2005 లోనే ఇక్కడ ప్రజల భూములు తీసుకున్నారు. వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. పైగా ఇష్టమున్నట్లు గేట్లు ఎత్తటంతో సగం ఊళ్లోకి నీళ్లు వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  రావుల చంద్రశేఖర్ రావు గారు మంచి మనిషి. అవినీతి మరక లేని వారు.  ఆయన కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పి ప్రజలకు న్యాయం చేయాల్సిందన్నారు. ఇప్పటికైనా ఈ అంశంలో ఇక్కడి ప్రజల తరఫున ముందుండి పోరాడాలని కోరారు.   

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget