Reliance Industries: ప్రతి వీధిలోకి వెళ్లాలి, ప్రతి ఇంటిలో కనిపించాలి - ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్
RCPL: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆధునిక వాణిజ్యంతో పాటు విమానయాన సంస్థలు, రైల్వేలలోకి ప్రవేశించాలనే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఉనికిని చాటాలనుకుంటోంది.

Reliance Industries Business Expansion Strategy: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఆధ్వర్యంలో పని చేసే 'ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్' (FMCG) కంపెనీ అయిన 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్' (Reliance Consumers Products Ltd), తన ఉత్పత్తుల పంపిణీని దేశవ్యాప్తంగా విస్తరించడానికి పూర్తి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కంపెనీ దగ్గర ఒక స్ట్రాంగ్ స్ట్రాటెజీ ఉంది. వ్యాపార వ్యూహంలో భాగంగా, తన ఉత్పత్తులను FY25 చివరి నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంచేందుకు పావులు కదుపుతోంది. వీధుల్లో ఉండే చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోటా RCPL ప్రొడక్ట్స్ కనిపించాలని, ప్రతి ఇంట్లో వాటి వినియోగం జరగాలన్నది ఈ కంపెనీ టార్గెట్.
ఇండిపెండెన్స్, కాంపా వ్యాపారాలు
'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్' (RCPL)కు చెందిన రెండు వేర్వేరు బ్రాండ్లు - ఇండిపెండెన్స్ (Independence), కాంపా కోలా (Campa Cola) ఇప్పటికే ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయి, తలో రూ. 1,000 కోట్ల టర్నోవర్ మార్కును దాటాయి. RCPL పోర్ట్‌ఫోలియోలో ఉన్న కొన్ని బ్రాండ్లు రూ. 100 కోట్ల టర్నోవర్‌కు చేరువ & పైన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తన ఉనికిని విస్తరించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడు సంవత్సరాలలో, తన డిస్ట్రిబ్యూషన్ సామర్థ్యాన్ని 5-6 మిలియన్లు పెంచాలని RCPL యోచిస్తున్నట్లు సమాచారం. RCPL ఉత్పత్తులు వీధివీధిలోకి విస్త్రతంగా అందుబాటులోకి వస్తే, దేశీయ మార్కెట్‌లో ఈ కంపెనీ బలమైన పట్టు సాధిస్తుంది.
ఈ రంగాలలోకి కూడా ప్రవేశం!
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఫోకస్ ఆధునిక వాణిజ్యంలోని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. విమానయాన సంస్థలు, రైల్వేలలో బలంగా నాటుకుపోవాలని ఈ కంపెనీ ప్లాన్ చేసింది. ఉత్పత్తులు డిస్ట్రిబ్యూషన్ & టర్నోవర్‌ను పెంచుకుంటూ, క్రమంగా గ్లోబల్ మార్కెట్లలోకీ ప్రవేశించి, అక్కడ కూడా తన ఉనికిని చాటాలనుకుంటోంది. ఇండిపెండెన్స్, కాంపా కోలాతో పాటు RCPL పోర్ట్‌ఫోలియోలో ఇంకా చాలా ఇతర బ్రాండ్‌లు ఉన్నాయి. అనేక ఇతర బ్రాండ్లను RCPL కొనుగోలు చేసింది. రావల్గావ్ షుగర్ కన్ఫెక్షనరీ నుంచి కాఫీ బ్రేక్, పాన్ పసంద్, లోటస్ చాక్లెట్ వంటి అనేక బ్రాండ్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇటీవలే, సాస్ & సుగంధ ద్రవ్యాల బ్రాండ్ SILను కూడా వెల్వెట్ నుంచి RCPL కొనుగోలు చేసింది.
రూ. 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆదాయం FY25 మొదటి తొమ్మిది నెలల్లో (2024 ఏప్రిల్ - డిసెంబర్ కాలంలో) రూ. 8,000 కోట్లుగా ఉందని 2024 డిసెంబర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) ప్రకటించింది. మార్కెట్ వర్గాలు చెబుతున్న ప్రకారం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మొత్తం FY25లో (2024 ఏప్రిల్ - 2025 మార్చి కాలం) రూ. 10,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా. ఒక అధికారి చెప్పిన ప్రకారం, మల్టీ నేషనల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీగా తనను తాను నిరూపించుకోవాలని RCPL లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ఈ లక్ష్యాన్ని చేరుతుందని సదరు అధికారి వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

