Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
Kiara Advani Baby Name : స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ తమ పాప పేరును సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. జులైలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Sidharth Malhotra Kiara Advani Couple Revealed Their Baby Girl Name : స్టార్ కపుల్, హీరోయిన్ కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్‌గా పేరెంట్స్ అయిన సంగతి తెలిసిందే. ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా జులై 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. క్యూట్ కపుల్ లిటిల్ ప్రిన్సెస్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
పాప పేరేంటంటే?
తాజాగా శుక్రవారం ఈ స్టార్ కపుల్ తమ పాప పేరు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. తమ కుమార్తె పేరు 'సయారా మల్హోత్రా' అని ప్రకటించారు. 'మా ప్రార్థనల నుంచి మా చేతుల వరకూ... మా సయారా మల్హోత్రాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.' అంటూ రాసుకొచ్చారు. అలాగే, ఈ పేరు అర్థం ఏంటో కూడా వివరించారు. సయారా అంటే 'యువరాణి' అని అర్థం. నిజంగానే సయారా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కపుల్‌కు విషెష్ చెబుతున్నారు.
View this post on Instagram
Also Read : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
2014లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా... మహేష్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' మూవీస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 2021లో 'షేర్షా' మూవీలో కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ టైంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి... 2023 ఫిబ్రవరి 7న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము పేరెంట్స్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు ఈ కపుల్. రీసెంట్‌గా పండంటి ఆడబిడ్డకు కియారా జన్మనిచ్చారు.





















