కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహేశ్ బాబు, రామ్ చరణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ అందాల భామ.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను ప్రేమించి పెళ్లిచేసుకుంది.

తాజాగా వారిద్దరూ పేరెంట్స్ కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారి కెరీర్, లవ్​స్టోరీ, పెళ్లి డిటైల్స్​పై ఓ లుక్కేసేద్దాం.

కియారా సిద్ధార్థ్​తో కలిసి షేర్షా మూవీ చేసింది. 2021లో ఈ సినిమా షూటింగ్​ సమయంలో వీరిమధ్య స్నేహం చిగురించింది.

అనంతరం వీరిపై డేటింగ్ రూమర్స్ బాగా వినిపించాయి. వెకేషన్స్​కి కూడా బాగా వెళ్లేవారు.

రెండేళ్ల రిలేషన్ తర్వాత వారి బాండింగ్ మరింత పెరిగింది. ఫిబ్రవరి 2023లో వారు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ పర్సనల్ కెరీర్​ను కొనసాగించారు. రీసెంట్​గా కియారా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా సోషల్ మీడియా ద్వారా తాము పేరెంట్స్ కాబోతున్నట్లు తెలిపింది ఈ బాలీవుడ్ జంట.

ఇండస్ట్రీలో ఉంటూ.. సేమ్ ప్రొఫెషన్​లో పార్టనర్​ని ఎంచుకుని.. సక్సెస్​ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.