Vanara Movie Teaser : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
Vanara Teaser Reaction : డిఫరెంట్ స్టోరీతో మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన 'వానర' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టీజర్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రిలీజ్ చేశారు.

Avinash Thiruveedhula's Vanara Movie Teaser Reaction : తమకు నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే అది తెచ్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే 'వానర' సైన్యం త్వరలోనే రాబోతోంది. అవినాష్ తిరువీధుల హీరోగా, డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఫస్ట్ మూవీ 'వానర'. సరికొత్త కథతో తెరకెక్కిన ఈ మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రిలీజ్ చేశారు.
'వానర' సైన్యం వచ్చేస్తోంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన టీజర్ అదిరిపోయింది. 'అసలు వానరులంటే ఎవరు? ఆకతాయిలు తెలివైనవారు మంచి కంత్రీగాళ్లు కూడా... వీళ్లకు నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే మాత్రం దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆఖరికి అది ఎత్తుకెళ్లింది రావణాసురుడైనా సరే లంకను మొత్తం తగలబట్టేస్తారు.' అంటూ వానర సైన్యం ఎలివేషన్ హైప్ క్రియేట్ చేస్తోంది. పొలిటికల్ ర్యాలీ కోసం తన బైక్‌ను ఎత్తుకెళ్లిన ఓ రాజకీయ నాయకుడికి, ఊరిలో సాధారణ యువకుడికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ స్టోరీ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అసలు తన బైక్ కోసం పొలిటీషియన్‌ను బతిమాలిన యువకుడు ఆ తర్వాత అది రాకపోయేసరికి ఏం చేశాడు? ఆ రాజకీయ నేతకే పోటీగా నిలిచాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా... నందు విలన్ రోల్ పోషిస్తున్నారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తుండగా... వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
'సినిమా సక్సెస్ కావాలి'
'వానర' మూవీ టీజర్ లాంఛ్‌కు గెస్ట్‌గా రావడం చాలా హ్యాపీగా ఉందని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్నారు. 'ఫస్ట్ మూవీకే హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేయడం అంత ఈజీ కాదు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అవినాష్ అండ్ టీం శ్రమకు తగిన ఫలితం దక్కాలి. సాయిమాధవ్ బుర్రా గారితో అహం బ్రహ్మస్మి సినిమా చేయాలి. త్వరలో ఆ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమా చూశాను బాగా వచ్చింది. శివాజీ రాజా గారు చేసిన సీన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ ఉన్నారు. మ్యూజిక్ మీద నాకున్న ఇష్టంతోనే మోహనరాగ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను.' అని అన్నారు.
థ్రిల్ పంచే 'వానర'
నేను యాక్టర్ కావాలన్న నా నాన్న కల ఈ రోజు నెరవేరింది అంటూ డైరెక్టర్, హీరో అవినాష్ అన్నారు. 'ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం. సాయిమాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ రాయడంతో పాటు వాటికి ఆర్టిస్టులు ఎలా రియాక్ట్ కావాలో వాయిస్ రికార్డ్ పంపేవారు. దాంతో నాకు షూటింగ్ చేయడం ఈజీ అయ్యింది. వివేక్ సాగర్ మ్యూజిక్ త్వరలో వింటారు. శివాజీ రాజా గారు, హర్ష.. ఇలా కో స్టార్స్ అంతా మాకు సపోర్ట్ అందించారు.
ఈ సినిమా కోసం అన్ని క్రాఫ్టుల గురించి తెలుసుకుని 5 సినిమాలకు రావాల్సిన అనుభవం ఈ ఒక్క సినిమాతో వచ్చింది. విశ్వక్ అన్న అడగ్గానే మా మూవీకి వాయిస్ ఇచ్చారు. అలాగే కిరణ్ అబ్బవరం మా కంటెంట్ చూసి సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో గైడ్ చేశారు. త్వరలో రిలీజ్‌కు తీసుకొస్తాం. వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది.' అన్నారు. అలాగే, ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని మూవీ టీంతో పాటు ముఖ్య అతిథులు ఆకాంక్షించారు.
Vanara Cast And Crew : అవినాశ్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
టెక్నికల్ టీమ్ - ప్రొడక్షన్ డిజైనర్ - నార్ని శ్రీనివాస్, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, డీవోపీ - సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ - వివేక్ సాగర్, డైలాగ్స్ - సాయిమాధవ్ బుర్రా, స్టోరీ, స్క్రీన్ ప్లే - విశ్వజిత్, సమర్పణ - శంతను పత్తి, పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్), బ్యానర్ - సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్, నిర్మాతలు - అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి, డైరెక్షన్ - అవినాశ్ తిరువీధుల.






















