Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
గువాహటి లో జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. టెస్ట్‌లో 408 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. 25 ఏళ్ల తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ పరాజయం చవిచూసింది టీమ్ ఇండియా. వరల్డ్ లోనే బెస్ట్ టెస్ట్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ఇండియా ఇలా వైట్ వాష్ కు గురవ్వడం మాములు విషయం కాదు. టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలిసిన పిచ్ లపై భారత్ ఇలా కూలిపోవడం, టీమ్ లో చేంజెస్, సరైన ప్లానింగ్ లేకే భారత్ ఇలా ఓటమి పాలవుతుందని అంటున్నారు.
మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెన్సషనల్ కామెంట్స్ చేసారు. కోచ్ గా కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకీ గంభీర్ చాలా అగ్రసివ్ గా సమాధానం చెప్పారు. “నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు... దేశం, భారత క్రికెట్ ముఖ్యమైనవి. నేను కాదు” అని గంభీర్ చెప్పారు.
గతంలో తన నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిందని, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలుచుకుందని గుర్తు చేశారు. విజయాలతో గర్వపడకుండా, వైఫల్యాల బాధ్యతను కూడా అంగీకరించడం అవసరమని తెలిపారు. సిరీస్ వైట్‌వాష్ గురించి మాట్లాడుతూ.. " బ్లేమ్ అందరిదీ.. కానీ అది నా నుంచే మొదలవుతుంది. టెస్ట్ క్రికెట్‌లో విజయం అందరి కృషితోనే సాధ్యమౌతుంది” అని ఆయన తెలిపారు.





















