ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
సౌతాఫ్రికాతో క్రూషియల్ వన్డే సిరీస్ కోసం రాంచీలో అడుగుపెట్టిన టీమిండియాకి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పెద్ద పార్టీ ఇచ్చాడు. మొత్తం టీంని రాంచీలోని తన ఫాం హౌస్‌కి ఆహ్వానించడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, ఇంకొంతమంది ఆటగాళ్లు గురువారం రాత్రి ధోనీ ఫాం హౌస్‌కి చేరుకున్నారు. ఇక పార్టీ తర్వాత కోహ్లీని ధోనీ స్వయంగా తన హోటల్ దగ్గర దింపాడు. కారులో వీళ్లిద్దరూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో కోహ్లీ, ధోనీ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.
అయితే ధోనీ ఇంట్లో టీమిండియా ప్లేయర్లు పార్టీ చేసుకోవడంతో కోచ్ గంభీర్‌ని ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఆల్రెడీ గంభీర్ చెత్త కోచింగ్ వల్లే సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడమే కాకుండా.. టీమిండియా దారుణంగా వైట్ వాష్ అయిందని విమర్శిస్తున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్. ఇలాంటి టైంలో ధోనీ, కోహ్లీ, రోహిత్, రుతురాజ్ ఒకేచోట చేరి పార్టీ చేసుకోవడంతో.. గంభీర్ ఫెయిల్యూర్‌ని వీళ్లంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
2011 వన్డే వరల్డ్ కప్ నుంచి ధోనీపై నిప్పులు చెరిగే గంభీర్.. ఆ తర్వాత కోహ్లీతో కూడా వైరం పెట్టుకున్నాడు. ఇక రీసెంట్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా వన్డే జట్టును నడుపుతున్న రోహిత్ నుంచి కెప్టెన్సీ లాగేసుకుని రోహిత్ లైఫ్‌లోనూ విలన్ అయ్యాడు. ఇక రుతురాజ్‌ని కాదని గిల్‌ని టీమ్‌లోకి సెలక్ట్ చేయడంతో రుతురాజ్‌కీ నెగెటివ్ అయ్యాడు. అందుకే.. వీళ్లంతా కలిసి పార్టీ చేసుకుంటుండతంతో గంభీర్ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. సఫారీ టీమ్‌తో 2 టెస్ట్‌ల సిరీస్‌లో వైట్ వాష్‌కి గురైన టీమిండియా కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. రాంచి వేదికగా.. 30వ తేదీన తొలి వన్డే జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ కూడా జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.




















