అన్వేషించండి

భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా

Hero Splendor Plus, Bajaj Platina 100 | బడ్జెట్ లో మంచి బైక్ కోసం చూస్తున్నారా? కొన్ని బైకులు తక్కువ ధరలో లభిస్తున్నప్పటికీ, ఎక్కువ మైలేజ్ ఇస్తాయి.

మీరు రోజువారీ జర్నీ కోసం తక్కువ పెట్రోల్, మెయింటనెన్స్ సులభంగా ఉండే, తక్కువ బడ్జెట్‌ బైక్ కోసం చూస్తున్నారా, భారతదేశంలో అనేక మంచి బైక్స్ ఉన్నాయి. కనిష్టంగా 60,000 రూపాయల నుండి 70,000 రూపాయల పరిధిలో లభించే, లీటరుకు 65 నుండి 75 కిలోమీటర్ల వరకు మైలేజీనిచ్చే బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడల్‌లు పూర్తి ట్యాంక్‌తో 800 కిలోమీటర్ల వరకు సైతం ప్రయాణించగలవు. ఈ బైక్‌లు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేవారికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)

Hero HF Deluxe ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్ మైలేజ్ బైక్‌లలో ఒకటి. దీని ధర చాలా తక్కువ, మెయింటనెన్స్‌కు ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదు. ఈ బైక్ 97.2cc ఇంజిన్‌తో వస్తుంది. బైక్ మీకు సులభంగా లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. సిటీ రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఈ బైక్ చాలా మన్నికైన ఎంపికగా పరిగణిస్తారు.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)

TVS Sport యువతకు ఇష్టమైన బైకులలో ఒకటి. ఎందుకంటే ఈ బైక్ చవక మాత్రమే కాదు, మంచి మైలేజీనిస్తుంది. దీని ఇంజిన్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ తేలికైనది. రద్దీగా ఉండే సిటీ రోడ్లపై కూడా సులభంగా వెళుతుంది. ఫుల్ ట్యాంక్ చేపిస్తే గరిష్టంగా 800 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. తక్కు పెట్రోల్ తో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

హోండా షైన్ (Honda Shine 100)

Honda Shine 100 చాలా తక్కువ సమయంలో భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న 100 cc బైక్‌లలో ఒకటిగా నిలిచింది.  ఈ బైక్ లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. Shine 100 సస్పెన్షన్ సరిగ్గా లేని రోడ్లపై కూడా కొంతమేర సౌకర్యవంతంగా ఉంటుంది. హోండా షైన్ ఇంజిన్ చాలా కాలం పాటు ఎలాంటి సమస్య లేకుండా నడుస్తుంది. దీని కారణంగా ఇది గ్రామాల్లో ఉండే వారికి ఫెవరెట్ బైకుగా ప్రసిద్ధి చెందింది.

బజాజ్ ప్లాటినా (Bajaj Platina 100)

భారతదేశంలో మైలేజ్ కింగ్‌గా పిలుచుకునే బైకు Bajaj Platina 100. ఇది లీటరుకు 75 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. దీని 11 లీటర్ల ఫుల్ ట్యాంక్ దాదాపు 800 కిలోమీటర్ల రేంజ్ జర్నీ చే

హీరో బైక్.. Hero Splendor Plus 

చాలా సంవత్సరాలుగా Hero Splendor Plus భారతదేశంలో నంబర్ వన్ బైక్‌గా ఉంది. ఈ బైక్ బలమైన నిర్మాణం, మంచి మైలేజ్, చాలా తక్కువ నిర్వహణ ఖర్చులతో ఫేమస్ అయింది. Splendor Plus దాదాపు లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో సైతం పెట్రోల్ ఆదా చేయడానికి సహాయపడుతుంది. 

మీకు ఏ బైక్ సరైనది?

మీ బడ్జెట్ 60,000 రూపాయల వరకు ఉంటే Hero HF Deluxe బైక్, TVS Sport మీకు బెస్ట్ ఛాయిస్. మీ మొదటి లక్ష్యం మైలేజ్ అయితే, Bajaj Platina 100 ఉత్తమ ఎంపిక. ఎక్కువ కాలం పాటు అత్యంత బలమైన, నమ్మదగిన బైక్‌గా Hero Splendor Plus మారింది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
Pollution Certificate Rules: పొల్యూషన్‌ సర్టిఫికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త BS6 వాహనాలకు మూడేళ్లకోసారి PUC సర్టిఫికెట్
వెహికల్‌ ఓనర్లకు భారీ ఊరట.. ఇక ఏటా కాదు, మూడేళ్లకు ఒకసారి పొల్యూషన్‌ సర్టిఫికెట్
River Indieకి కొత్త వెర్షన్‌ రాబోతోందా? RX02, RX03 స్కూటర్ల ఫోటోలు లీక్.. డిజైన్‌లో మార్పులివే!
త్వరలో మార్కెట్‌లోకి రానున్న రివర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే.. ఫోటోలు లీక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget