అన్వేషించండి

Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం

Goa Cylinder Blast | గోవాలోని అర్పోరా గ్రామంలోని నైట్ క్లబ్లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. 25 మంది సిబ్బంది మరణించారు. పూర్తి వివరాలు, అధికారుల ప్రకటన.

Goa nightclub Fire Accident | ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని నైట్ క్లబ్‌లో శనివారం (డిసెంబర్ 6) అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అర్పోరాలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది సిబ్బంది మృతిచెందారు. ఈ ఘటనపై గోవా పోలీసు చీఫ్ అలోక్ కుమార్ మాట్లాడుతూ, సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగాయని తెలిపారు. ఏఎన్ఐ నివేదిక ప్రకారం, "కనీసం 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో క్లబ్ సిబ్బంది ఉన్నారు" అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. చనిపోయిన వారిలో కిచెన్ సిబ్బంది అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ సిలిండర్ పేలుడు ఘటనపై స్పందించారు. సిలిండర్ పేలుడు తరువాత కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని తెలిపారు. క్లబ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 20 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని సమాచారం.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం ప్రమోద్ సావంత్..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను సీఎం సావంత్ ఆదేశించారు. భద్రతా ప్రమాణాలలో నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరణించిన వారిలో ముగ్గురు లేదా నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు. వారు గోవాకు హాలిడే ట్రిప్ కోసం వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.

 అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ 

అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టాయి. పొగ, ఎగిసిపడుతున్న మంటలు రెస్క్యూకు పెద్ద ఆటంకంగా మారాయి. అయితే డజన్ల కొద్దీ ప్రజలను సకాలంలో సకాలంలో బయటకు తీసుకురాగలిగారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి రాత్రంతా పట్టిందని, ఇప్పుడు అన్ని నైట్ క్లబ్‌లలో అగ్ని భద్రతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. తద్వారా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడవచ్చు అన్నారు.

భద్రతా లోపాలను గుర్తు చేస్తున్న పాత ప్రమాదాలు

భారతదేశంలో అగ్నిప్రమాదాలు తరచుగా భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దీనికి నిదర్శనం. హైదరాబాద్‌లో మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదంలో 17 మంది మరణించగా, కోల్‌కతాలోని ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, గుజరాత్‌లోని ఒక వినోద ఉద్యానవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మరణించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget