అన్వేషించండి

Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

DGCA show cause notice to Indigo: ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపం కారణంగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఆపరేషన్ విఫలమైంది. నిబంధనలు పాటించలేదని డీజీసీఏ పేర్కొంది.

DGCA Action Against Indigo CEO | ఇండిగో విమానాలను రద్దు చేయడం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయాల వరకు గందరగోళం నెలకొంది. దీనికి ప్రభుత్వం ఇండిగో ఎయిర్‌లైన్‌ను బాధ్యులను చేసింది. DGCA ఇండిగో సీఈఓకి శనివారం నాడు షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలని నోటీసులలో పేర్కొంది. 

గత మూడు రోజుల నుంచి వేలాది మంది ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీపై ఎందుకు పెనాల్టీ విధించకూడదో తెలపాలని DGCA ఇండిగోకు జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఎయిర్‌లైన్ కంపెనీ భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

CEO ఎయిర్‌లైన్ కార్యకలాపాల బాధ్యత: DGCA

ఎయిర్‌లైన్ సజావుగా నడపటం ఇండిగో సీఈవో బాధ్యత అని DGCA స్పష్టం చేసింది. అయితే ప్రయాణీకుల సౌకర్యాలు,  కార్యకలాపాలను నిర్వహించడంలో CEO ఫెయిలయ్యాడు. 24 గంటల్లో DGCA మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలని CEOకు నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇవ్వకపోతే, DGCA దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. 

ఇండిగో షెడ్యూల్ చేసిన విమానాలలో సమస్యలు

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో విమానాలలో పెద్ద లోపాలు ఉన్నాయని తెలిపింది. ఇటీవల ఇండిగో  షెడ్యూల్ చేసిన పలు విమానాలలో పెద్ద సమస్యలు తలెత్తాయి. దీని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బంది, కష్టం, బాధ కలిగింది. విమానాలను రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎయిర్‌లైన్ సవరించిన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్) నిబంధనలను అమలు చేయడానికి సరైన సన్నాహాలు చేయకపోవడం. పైలట్‌లు/ సిబ్బంది కోసం సరైన ఏర్పాట్లు, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయలేదు.

ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేదు: DGCA

ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ విఫలమవ్వడం ప్లానింగ్, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాన్ని చూపుతుందని నోటీసులో డీజీసీఏ పేర్కొంది. ఇండిగో ఎయిర్‌లైన్ అనేక నిబంధనలను పాటించలేదు. ఇండిగో తమ ప్రయాణికులకు ఆలస్యం, రద్దు గురించి సకాలంలో సమాచారం అందించలేదని, అవసరమైన సహాయం అందించలేదని DGCA ఆరోపించింది. ఇది కచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని నోటీసుల్లో పేర్కొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Embed widget