Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
నిన్న సౌతాఫ్రికా మీద 271 పరుగుల ఛేజింగ్ లో 34వ ఓవర్ అది. జైశ్వాల్ 96పరుగుల మీద ఉన్నాడు. కెరీర్ లో ఫస్ట్ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ కొద్దిగా ప్రెజర్ ఫీలవుతున్నాడు. అలాంటి టైమ్ లో స్ట్రైకింగ్ తీసుకున్న కింగ్ విరాట్ కొహ్లీ ఓ పని చేశాడు. కార్బిన్ బోష్ వేసిన తన నాలుగో ఓవర్ ఆఖరి బంతిని లాగి పెట్టి సిక్స్ బాదాడు విరాట్. రీసెంట్ టైమ్స్ లో ఇండియా క్రికెట్ చూడని షాట్ అది. వైడ్ లాంగాన్ లో సిక్స్ వెళ్లి పడింది. అప్పుడు కెమెరా కోహ్లీ కి క్లోజప్ పెడితే కనిపించింది ఏంటంటే అసలు కోహ్లీ ఆ బాల్ ని చూడకుండానే సిక్స్ కొట్టాడు. నో లుక్ సిక్స్ అంటారు దీన్ని. ఫుల్ ఆఫ్ అగ్రెషన్ లో ఉన్నాడు. బాల్ ఆల్మోస్ట్ బౌండరీ లైన్ అవతల పడుతున్నప్పుడు సరిగ్గా అది ఎక్కడ పడుతుందో అక్కడ చూశాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఫుల్ ఆఫ్ కన్విక్షన్ ఇది. ప్యూర్ టైమింగ్. ఓ బ్యాటర్ కి తన మీద తనకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్. బంతిని సరిగ్గా జడ్జ్ చేయగలిగితే చాలు అది వెళ్లే దూరం పడే తీరు అన్నీ బ్యాటర్ కి పక్కాగా తెలిసిపోతాయి. అయితే ఇలాంటి షాట్స్ అంత అగ్రెసివ్ గా ఆడాలంటే మాత్రం ఆ ఆడే వాడి పేరు విరాట్ కోహ్లీ అయ్యి ఉండాలన్నట్లు ఉంది ఆ షాట్ మాత్రం. 2016 టైమ్ లో కోహ్లీ తన కెరీర్ పీక్స్ లో ఉన్నాడు. కుదిరితే సెంచరీ...మూడ్ బాగోకుంటే హాఫ్ సెంచరీ అంతే అస్సలు తగ్గే వాడే కాదు. అలాంటి కోహ్లీ లో చాన్నాళ్ల కనిపించిన ఆకలి ఇది. 37 ఏళ్ల వయస్సులో ఇప్పుడు తన కెరీర్ లో చరమాంకంలో మళ్లీ అలాంటి ఆకలిగొన్న పులిని రెచ్చగొట్టి మరీ లేపుతున్నాడు. కోహ్లీ అభిమానులకే కాదు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కే పండుగ ఇలాంటి వైల్డ్ నెస్.





















