Tips for Better Sleep : ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదా? అయితే బెటర్ స్లీప్ కోసం కచ్చితంగా వీటిని ట్రై చేయండి
Effective Sleeping Techniques: నిద్ర సమస్యలున్నవారు రాత్రుళ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే మీరు నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ టిప్స్‌ని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.

Sleeping Techniques : రాత్రుళ్లు ఎంతసేపైనా నిద్ర రావట్లేదా? నైట్ రీల్స్ చూసుకుంటూ.. లేదా ఫోన్ వాడుతూ.. తెల్లవారుజామున నిద్రపోతున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరు పాడు చేసుకుంటున్నట్లే. అందుకే ఈ విషయంపై కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ అంతట మీరు.. మీ స్లీపింగ్ షెడ్యూల్‌ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్‌ని కచ్చితంగా ఫాలో అవ్వాలంటున్నారు.
రిలాక్సేషన్.. (Progressive Muscle Relaxation)
శరీరానికి రిలాక్స్ ఇవ్వాలనుకుంటే.. మీ కండరాలను ఓ 5 నుంచి పది సెకన్లు బిగించి.. ఆపై రిలీజ్ చేయాలి. నిద్రకు ముందు బెడ్‌పై పడుకుని.. రెండు లేదా మూడుసార్లు బిగించి వదిలేస్తే.. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది.
బ్రీతింగ్ వ్యాయామాలు (Deep Breathing Exercises)
పడుకుని కళ్లు మూసుకుని.. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చుకుని ఊపిరితిత్తుల నిండా నింపుకోవాలి. ఇప్పుడు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. దీనినే డీప్ బ్రీతింగ్ ప్రక్రియ అంటారు. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి.. యాంగ్జైటీ తగ్గి నిద్ర మెరుగవతుంది.
ధ్యానం (Mindfulness Meditation)
నిద్రకు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మీ బెడ్ రూమ్ ఇలా ప్రశాంతంగా ఉంటే.. హాయిగా కూర్చోని లేదా పడుకొని మెడిటేషన్ చేయవచ్చు. కళ్లు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టుకోండి. మీ మనసులో వేరే ఆలోచనలు వస్తున్నప్పుడు మళ్లీ వాటిని డైవర్ట్ చేసి.. మళ్లీ మీ శ్వాస వైపు మనసును మరల్చండి. ప్రతిరోజూ దీనిని 10 నుంచి 20 నిమిషాలు ఫాలో అయితే డిఫరెన్స్ మీరే చూడొచ్చు.
విజువలైజేషన్ (Visualization Techniques)
పడుకొని కళ్లు మూసుకుని ప్రశాంతమైన దృశ్యాన్ని ఊహించుకోండి. మీకు నచ్చిన లొకేషన్, బీచ్ వంటి వాటిని ఊహించుకుని.. మీరు అక్కడే ఉన్నట్లు ఇమేజిన్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఉంటే ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తారో ఊహించుకోండి. మీరు అక్కడే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటే.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. నిద్ర మెరుగవుతుంది.
బ్రీతింగ్ టెక్నిక్ (4-7-8 Breathing Technique)
ముక్కు ద్వారా నాలుగు నెంబర్స్ లెక్కపెడుతూ.. గాలి పీల్చుకుని 7 నెంబర్స్ లెక్కపెడుతూ.. దానిని హోల్డ్ చేయండి. 8 నెంబర్స్ లెక్కిస్తూ నోటి ద్వారా వదిలేయండి. ఇలా చేస్తూ ఉంటే.. శరీరం విశ్రాంతి, ప్రశాంతతను అందిస్తుంది.
యోగా (Yoga and Stretching)
టెన్షన్ నుంచి రిలీఫ్ కావాలనుకుంటే శరీరాన్ని సున్నితంగా స్ట్రెచ్ చేయండి. యోగా లేదా పైలేచ్స్ కూడా శరీరాన్ని సాగదీసి.. రిలాక్స్‌ని ఇస్తాయి. జర్నలింగ్ కూడా మంచి రిలీఫ్‌ని ఇస్తుంది.
వెచ్చని నీటితో స్నానం చేయడం, మొబైల్స్‌కి దూరంగా ఉండడం, విశ్రాంతినిచ్చే మ్యూజిక్ వినడం వల్ల కూడా నిద్ర మెరుగవుతుంది. మీ రూమ్ డార్క్‌గా ఉంటే నిద్ర వచ్చే అవకాశం, నాణ్యత పెరుగుతుంది. వ్యాయామం, మంచి భోజనం కూడా మెరుగైన నిద్రను ఇస్తుంది. ఈ టిప్స్‌కి నిద్ర మెరుగవకుంటే వైద్య సహాయం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

