Sleeping Pills : నిద్ర మాత్రలు వాడుతున్నారా? ఓవర్ డోస్ అయితే పరిస్థితి ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
Sleeping Pills Risks : నిద్ర సమస్యలుండేవారికి తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్లు నిద్ర మాత్రలు సూచిస్తారు. వాటిని తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Sleeping Pill Risks and Precautions : నిద్రలేమి సమస్యలు వివిధ కారణాల వల్ల వస్తాయి. కొన్నిసార్లు లైఫ్‌స్టైల్ మార్చుకుటే స్లీపింగ్ సైకిల్ మారిపోతుంది. అలాగే నిద్ర సమస్యలు దూరమవుతాయి. అయితే మరికొందరిలో పరిస్థితి ముదిరిపోతుంది. ఏమి చేసినా నిద్ర రావట్లేదనుకున్నప్పుడు వైద్యులు వారిని పరీక్షించి.. వారి అవసరానికి అనుగుణంగా.. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ నిద్రమాత్రలను డోసేజ్ ప్రకారం వాడాలని సూచిస్తారు. అయితే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఓవర్‌డోస్ అయితే పరిస్థితి ఏంటి?
నిద్రమాత్రలు.. వీటినో హిప్నోటిక్స్ అని కూడా అంటారు. ఇవి నిద్రలేమి సమస్యలను, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను దూరం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే వీటిని వైద్యులే సూచించినా.. రెగ్యులర్‌గా తీసుకోకూడదు. ఈ విషయాన్ని వైద్యులు కూడా సూచిస్తారు. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగుకాకపోగ.. తీవ్రమమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎక్కువగా తీసుకుంటే కలిగే సమస్యలు..
నిద్రమాత్రలను మోతాదుకు మించి తీసుకుంటే చాలా ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడం పూర్తిగా కష్టమై ప్రాణాంతకమవుతుంది. హృదయ సంబంధ సమస్యలు వస్తాయి. గుండె లయలో మార్పులు, బీపీ తగ్గడం, కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలియని స్టేజ్‌కి వెళ్లిపోతారు. మైకం కమ్మి.. వీక్ అయిపోతారు. కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉంది.
రెగ్యులర్‌గా తీసుకుంటే వచ్చే ఇబ్బందులు..
నిద్రమాత్రలు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా మరెప్పుడూ వేసుకోకూడదు. అది కూడా వైద్యులు సూచించిన మేరకే తీసుకోవాలి. అంతేకానీ రోజూ లేదా రెగ్యులర్‌గా నిద్రమాత్రలు తీసుకుంటే శారీరకంగా వాటికి అలవాటు పడి.. వ్యసనంగా మారుతాయి. అలాగే కంటిన్యూగా తీసుకుని వాటిని ఆపేస్తే ఆందోళన, నిద్రలేమి, మూర్ఛవంటి లక్షణాలు వస్తాయి. అలాగే నిద్రమాత్రలను ఇతర మెడిసన్స్‌తో కలిపి తీసుకుంటే మరింత డేంజర్ అవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిద్రమాత్రలు మీరు కచ్చితంగా తీసుకోవాలనుకుంటే.. వైద్యులు సూచించిన విధంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. తక్కువ మోతాదులో అవసరానికి తగ్గట్లు తీసుకోవాలి. నిద్రమాత్రలకు మీ శరీరం ఎలా స్పందిస్తుందో చెక్ చేసుకోవాలి. ఏమైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర మందులు, ఆల్కహాల్ వంటి వాటితో తీసుకోకూడదు.
లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేస్తే నిద్ర సమస్యను కచ్చితంగా దూరం చేసుకోవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ.. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ వ్యాయామాలు కూడా కచ్చితంగా నిద్రను ప్రోత్సాహిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. ట్యాబ్లెట్స్ లేకుండా ముందు నిద్ర సమస్యను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. నిద్రమాత్రలు వాడాల్సిన అవసరం ఉండదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















