అన్వేషించండి

Lip Lock Kiss History: ముద్దు అనే కాన్సెప్టు ఎప్పటి నుంచి మొదలైంది? లిప్-లాక్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు?

Lip Lock Kiss History: భారత్‌లో ముద్దు పెట్టుకోవడం ఇప్పటికీ చెడుగానే భావిస్తారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటే వింతగా చూస్తారు. ఇంతకీ మొదటి ముద్దు నిజంగా ఎప్పుడు మొదలైంది. ఎవరు పెట్టారు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Lip Lock Kiss History: ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని ముద్దు పెట్టుకుని ఉండవచ్చు. మొదటి ముద్దు ఎవరు అని అడగాలనే ఆలోచన మీ మనసులోకి ఎప్పుడైనా వచ్చిందా? ప్రేమికులు అనివార్యంగా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ముద్దు నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమను బలపరుస్తుంది. ఎవరు మొదట ముద్దు పెట్టుకున్నారు? అది ఎప్పుడు ప్రారంభమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

ప్రేమ ముద్దు గురించి చాలా కాలంగా పాటలు, కవితలు, కథలలో చెబుతుంటారు. సినిమాల్లో మరింత రసరమ్యంగా చూపిస్తుంటారు. అయితే, మొదటి ముద్దు  పెట్టిన వ్యక్తి ఎవరు ఏ రోజున కిస్ చేశాడనే విషయంపై నేటికీ స్పష్టత లేదు. కొన్ని చారిత్రక పత్రాలు చూస్తే ముద్దుల చరిత్ర 1000 సంవత్సరాల క్రితం నాటిదిగా తెలుస్తోంది. కానీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 4500 సంవత్సరాల క్రితం పురాతన మధ్యప్రాచ్యంలో లిప్‌కిస్‌లు సాధారణమయ్యాయి.

మొదటి ముద్దు గురించి వివిధ వాదనలు ఉన్నాయి. కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం,  ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మెసొపొటేమియాలోనే ఇది ప్రారంభమైందని నమ్ముతున్నాయి. మెసొపొటేమియా నుంచి వేలాది మట్టి పలకలు ఇప్పటికీ ఉన్నాయి, ఇవి ముద్దుతో సహా ప్రాచీన ప్రపంచంలో ప్రేమ సాన్నిహిత్యాన్ని వర్ణిస్తాయి.

ముద్దుకు మెసొపొటేమియాతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు నమ్మవచ్చు, కానీ భారత్‌లోమాత్రం 3500 సంవత్సరాల పురాతన మాన్యుస్క్రిప్ట్ ప్రకారం, లిప్ కిస్ పురాతన మధ్యప్రాచ్యం,భారత్‌లో మొదలైందని చెబుతున్నారు. 

పురాతన భారత్‌లో భాగస్వామికి వివాహ ప్రతిపాదన చేయడానికి ఈ ఆచారం నిర్వహించేవారని కొన్న ఆధారాలు చెబుతున్నాయి. తరువాత దీనిని ఆచారాలతో ముడిపెట్టారు. అయితే, మెసొపొటేమియాలో లభించిన ఆధారాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. 

మరికొన్ని రిపోర్టుల ప్రకారం ముద్దులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్భవించాయి, కానీ అది మొదట ఎక్కడ ప్రారంభమైందో కచ్చితంగా చెప్పడం కష్టమని కొందరు చరిత్రకారులు అంటున్నారు. 

ముద్దుకో అర్థం ఉంది

కానీ మనం ఎవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు దాదాపు 8 కోట్ల బ్యాక్టీరియా మార్పిడి అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి ముద్దుకు వేరే అర్థం ఉంటుంది. నుదిటిపై ముద్దు పెట్టుకుంటే, వారు మిమ్మల్ని ఇష్టపడటమే కాకుండా మిమ్మల్ని గౌరవిస్తారని అర్థం. ఇది స్నేహితులు లేదా తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా ఉంటుంది. 

ఎవరైనా ప్రేమలో పడినప్పుడు, వారు ఆ వ్యక్తి బుగ్గపై ముద్దు పెట్టుకుంటారు. ఎవరైనా మీ బుగ్గపై ముద్దు పెట్టుకుంటే, వారు మీరు ముద్దుగా, అందంగా ఉన్నారని అనుకుంటారు. ఫ్రెంచ్ ముద్దును భాగస్వాములు పెట్టుకుంటారు. ఇది ఆకర్షణ,  సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. మీరు చాలా కాలంగా ప్రేమలో ఉంటే ఈ ముద్దు మంచిది. 

చేతిని ముద్దు పెట్టుకోవడంలో ఒక ప్రత్యేక అర్థం ఉంది. అది అవతలి వ్యక్తి మీ పట్ల ఆకర్షితుడయ్యాడని, మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాడని సూచిస్తుంది. లిప్ కిస్‌లు అనేది సాధారణంగా భాగస్వాముల మధ్య ఇచ్చే ముద్దు. అయితే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెదవులపై ముద్దు పెట్టుకుంటున్నారు.

మనుషులు మాదిరిగా జంతువుల ముద్దూముచ్చట 

ముద్దు పెట్టుకోవడం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. కొన్ని జంతువులు కూడా ముద్దు పెట్టుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి చింపాంజీ. అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త ఫ్రాన్స్ డి వాల్, చింపాంజీలు పోరాటం తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటాయని చెబుతున్నారు. ఫ్రాన్స్ డి వాల్ ప్రకారం, చింపాంజీలు పోరాటం తర్వాత ముద్దు పెట్టుకుంటాయి లేదా కౌగిలించుకుంటాయి. ఇది ఆడ చింపాంజీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో, అవి మనుషుల మాదిరిగానే ముద్దు పెట్టుకుంటాయి.

Frequently Asked Questions

ముద్దుల చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమైంది?

కొన్ని చారిత్రక పత్రాల ప్రకారం, ముద్దుల చరిత్ర 1000 సంవత్సరాల క్రితం నాటిది. అయితే, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 4500 సంవత్సరాల క్రితం పురాతన మధ్యప్రాచ్యంలో లిప్ కిస్ లు సాధారణమయ్యాయి.

మొదటి ముద్దు ఎక్కడ ప్రారంభమైంది?

కోపెన్ హెగన్ విశ్వవిద్యాలయం, ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం మెసొపొటేమియాలోనే ఇది ప్రారంభమైందని నమ్ముతున్నాయి. మెసొపొటేమియా నుంచి లభించిన మట్టి పలకలు ప్రేమ సాన్నిహిత్యాన్ని వర్ణిస్తాయి.

భారతదేశంలో లిప్ కిస్ ల గురించి ఏమి చెబుతున్నారు?

భారతదేశంలో 3500 సంవత్సరాల పురాతన మాన్యుస్క్రిప్ట్ ప్రకారం, లిప్ కిస్ పురాతన మధ్యప్రాచ్యం, భారతదేశంలో మొదలైందని చెబుతున్నారు. పురాతన భారత్ లో భాగస్వామికి వివాహ ప్రతిపాదన చేయడానికి ఈ ఆచారం నిర్వహించేవారని కొన్న ఆధారాలు చెబుతున్నాయి.

ముద్దు పెట్టుకోవడం వలన ఏమి జరుగుతుంది?

మనం ఎవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు దాదాపు 8 కోట్ల బ్యాక్టీరియా మార్పిడి అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి ముద్దుకు వేరే అర్థం ఉంటుంది.

జంతువులు కూడా ముద్దు పెట్టుకుంటాయా?

అవును, మనుషులు మాదిరిగా కొన్ని జంతువులు కూడా ముద్దు పెట్టుకుంటాయి. చింపాంజీలు పోరాటం తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటాయి, ఇది ఆడ చింపాంజీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Holi 2026 Recieps : హోలీ 2026 స్పెషల్ బాదం షర్బత్.. సులభమైన టేస్టీ రెసిపీ ఇదే
హోలీ 2026 స్పెషల్ బాదం షర్బత్.. సులభమైన టేస్టీ రెసిపీ ఇదే
Holi 2026 : ‘హ్యాపీ హోలీ’కు బదులు హోలీ 2026 స్టిక్కర్స్.. WhatsApp‌లో ఇలా ఈజీగా క్రియేట్ చేసేయండి
‘హ్యాపీ హోలీ’కు బదులు హోలీ 2026 స్టిక్కర్స్.. WhatsApp‌లో ఇలా ఈజీగా క్రియేట్ చేసేయండి
Alpine Divorce : బ్రేకప్, విడాకుల తరువాత మరో న్యూ ట్రెండ్.. 'ఆల్పైన్ డివోర్స్' గురించి తెలుసా? పార్టనర్​ని పర్వతాలకు తీసుకెళ్లి మరీ..
బ్రేకప్, విడాకుల తరువాత మరో న్యూ ట్రెండ్.. 'ఆల్పైన్ డివోర్స్' గురించి తెలుసా? పార్టనర్​ని పర్వతాలకు తీసుకెళ్లి మరీ..
Fake Ginger-Garlic Paste : బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget