Side Effects of not Getting Enough Sleep : గంట నిద్ర తక్కువైతే నాలుగు రోజులు ఎఫెక్ట్ ఉంటుందట.. మీరెన్ని గంటలు పడుకుంటున్నారు?
Health Issues : రాత్రి నిద్ర ఓ గంట తక్కువైతే.. దాని ప్రతికూల ప్రభావం నాలుగు రోజులు ఉంటుందంటున్నారు నిపుణులు. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలో.. నిద్రలేకుంటే ఏమవుతాదో ఇప్పుడు చూద్దాం.
Health Issues with Lack of Sleep : నిద్రలేమి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. అయితే రాత్రి నిద్ర గంట తక్కువైతే.. దాని ఎఫెక్ట్ నాలుగు రోజులు ఉంటుందట. ఇదే కంటిన్యూ అయితే ఒత్తిడి, బరువు పెరగడం, మతిమరుపు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయంటూ.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఇవి కేవలం చిన్న సమస్యలను కాకుండా.. పెద్ద సమస్యలను పెంచి.. వాటిపై ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అంటున్నారు. అందుకే తగినంత నిద్ర అవసరమని చెప్తున్నారు.
మెదడుతో సహా..
శరీరంలోని ప్రతి అవయవానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇది శక్తిని ఆదా చేయడానికి, నిల్వ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రోజువారి ఆరోగ్య సమస్యలు, గాయాల నుంచి విశ్రాంతినిస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. మెరుగైన నిద్ర ఉంటే.. శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. విషపూరిత పదార్థాలు.. టాక్సిన్లు శరీరం నుంచి బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ డేకి చాలా ఫ్రెష్‌గా ఉండగలుగుతారు. అలాంటిది.. రోజులో గంట నిద్ర తక్కవైనా అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుందని చెప్తున్నారు.
నిద్ర విషయంలో కాంప్రిమైజ్ వద్దు
సరైన నిద్ర లేకపోవడం వల్ల.. పనిపై ఫోకస్ చేయలేరు. జ్ఞాపకశక్తి సమస్యలు ఎక్కువ అవుతాయి. స్ట్రెస్, ఆందోళన ఎక్కువ అవుతుంది. రోజూ చేయాల్సిన పనులు చేయలేకపోతారు. నిద్రలో తగ్గాల్సిన సమస్యలు మరింత ఎక్కువై శరీరానికి నష్టం కలిగిస్తాయి. గుండె నుంచి.. రోగనిరోధక వ్యవస్థ వరకు అని ప్రతికూలంగా స్పందిస్తాయి. నిద్రలేమి శరీరం, మెదడుపై అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి.. దీని విషయంలో కాంప్రిమైజ్ కావొద్దని సూచిస్తున్నారు.
ఆ లక్షణాలుంటే.. తక్కువైనట్లే..
శరీరానికి సరిపడినంత నిద్ర లేకుంటే కొన్ని సమస్యలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచాక.. రిఫ్రెష్‌గా ఉండలేరు. అలసిపోయినట్లు ఎక్కువగా అనిపించడం, పగలు ఎక్కువగా ఆవలించడం, కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ కూడా నిద్రలేమి లక్షణాలే. ఈ అలసట వల్ల అధిక నిద్రకు దారి తీస్తుంది. ఇది మీ పనులు, రోజువారీ చేయాల్సిన పనులు చేయకుండా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఏడు గంటల కంటే నిద్ర తక్కువైతే.. ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.
సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎక్కువైతాయి. ఇదొక మానసిక సమస్యగా మారి.. నిరాశ, ఆందోళనను పెంచుతుంది. నిద్రలేమితో బాధపడేవారు డిప్రెషన్‌కు ఎక్కువగా గురవుతారని పరిశోధనలు చెప్తున్నాయి. దాదాపు 80 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నరాల సంబధింత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ముఖంపై ఈ మార్పులు ఉంటాయి..
సరైన నిద్ర లేకుంటే అది ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. కల్లకింద నల్లటి వలయాలు, కనురెప్పలు వాలిపోవడం, చర్మం పాలిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, కళ్లు ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ పెరిగి.. కొల్లాజెన్ తక్కువైపోతుంది. చర్మాన్ని మృదుత్వాన్ని కోల్పోయి.. ముడతలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి ఫ్లూ, జలుబు వంటి సమస్యలు ఎక్కువైతాయి. బరువు పెరగడం, ఒత్తిడి, నిరాశ పెరగడం, గుండె జబ్బులు, వృద్ధాప్య సంకేతాలు ఇవన్నీ నిద్రలేమి వల్ల కలిగేవే. డ్రైవింగ్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏటా జరిగే ప్రమాదాల్లో సగం నిద్రవల్లే జరుగుతున్నాయని సర్వే తేల్చేంది. ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు నిద్రలేమితోనే ఎక్కువైతాయి.
రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలంటే..
వయసు 65 దాటిన వారు 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. 18 నుంచి 64 సంవత్సరాల మధ్యవారు 7 నుంచి 9 గంటలు.. 14 నుంచి 17 సంవత్సరాల వారు.. 8 నుంచి 10 గంటలు.. 6 నుంచి 13 సంవత్సరాల వారు 9 నుంచి 11 గంటలు పడుకోవాలి. 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నవారు 10 నుంచి 13 గంటలు, రెండేళ్లు వచ్చేవరు వారి సగటు నిద్ర 15 గంటలు ఉంటుంది.
శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ.. వ్యాయామం, పనులు రెగ్యూలర్‌గా చేసుకుంటే కనీసం ఏడు గంటల నిద్ర వస్తుందట. ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే నిద్రపోయేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఉంటే నిద్ర మెరుగవుతుంది. నిద్ర అనేది ప్రాథమిక అవసరంగా గుర్తించాలి.
Also Read : మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. వెంటనే నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి