Vastu Tips in Telugu: వేసవి కాలం మట్టి కుండ కొన్నారా.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలో తెలుసా , నల్లటి కుండ కొనొచ్చా!
Vastu Tips: వేసవి మొదలైంది. ఎండలు హోరెత్తిపోతున్నాయ్. చల్లటి నీటికోసం మట్టి కుండలు తీసుకొచ్చే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంతకీ వాస్తు ప్రకారం ఆ కుండను ఏ దిశలో ఉంచాలి?

Best Vastu Direction For Keeping Clay Pot: ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. కూలింగ్ వాటర్ తాగి అనారోగ్యం కొనితెచ్చుకునేకన్నా కుండలో నీళ్లు తాగడం మంచిదనే ఆలోచనతో ఉంటున్నారు. అందుకే సమ్మర్ ప్రారంభం కాగానే కుండ కొనితెచ్చుకుంటున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల కుండలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకునేటప్పుడు .. కుండ ఇంట్లో పెట్టే ప్రదేశం విషయంలోనూ వాస్తు నియమాలు పాటించాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండను తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంటి సానుకూల శక్తి, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. అందుకే శాస్త్ర ప్రకారం మట్టి కుండను ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడం మంచిది. ఈ దిశ కుబేరుడికి చెందినది కావడంతో మట్టి కుండను ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా అయితే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని , ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని విశ్వాసం. ఎప్పుడూ కూడా మట్టి కుండను ఖాళీగా ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంటికి అశుభం అని నమ్ముతారు. కుండను ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. టాయిలెట్ , చెత్త పెట్టే ప్రదేశం, చెప్పులు విడిచే ప్రదేశంలో ఉంచడం అశుభం. వంటగదిలో మట్టి కుండను ఉంచినట్లయితే దానిని స్టవ్ కు దూరంగా ఉంచాలి. ఎప్పుడూ కుండనిండుగా నీళ్లు ఉంచాలి. ఖాళీ కుండను పేదరికానికి నిర్వచనంగా చెబుతారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ఇంట్లోనే కాదు..కార్యాలయంలోనూ మట్టి కుండను ఉత్తర దిశలోనే ఉంచాలి. ఈ దిశలో నీటి కుండను ఉంచితే వినికిడి సామర్ధ్యం పెరుగుతుందట.
కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో మట్టికుండనిండుగా నీళ్లు ఉంచితే చేపట్టిన పని పూర్తవుతుందని విశ్వాసం. మట్టితో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు వినియోగిస్తారు. గ్రహాలను నియంత్రించడానికి.. మట్టి వస్తువులు ఉపయోగపడతాయని నమ్ముతారు. అందుకే ఇంట్లో మట్టి కుండను ఉంచినట్లయితే, జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు , చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది.
ఇక ఎర్రటి మట్టి కుండ మాత్రమే కాదు కొందరు నల్లటి మట్టి కుండ కొనుగోలు చేస్తారు. నల్లటి కుండ ఇంట్లో ఉండొచ్చా అనే సందేహం కొందరిలో ఉంటుంది. కానీ నల్లటి మట్టి కుండలు కూడా సానుకూల ఫలితాలనే ఇస్తాయంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటిపై ఉండే చెడు కన్ను ప్రభావాన్ని నల్లటి మట్టి కుండలు తగ్గిస్తాయట. ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడకుండా నిరోధిస్తాయని విశ్వాసం. ఇంట్లో నల్లటి మట్టి కుండ పగిలింది అంటే..అదో కీడు జరగబోతోందని అర్థం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినవి, కొన్ని వాస్తు గ్రంధాల్లో సూచించిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఎందుకంటే ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. వీటి గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన వాస్తుపండితుల సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

