Vastu Shastra: ఇంట్లో వాస్తుదోషం ఉందని సూచించే సమస్యలు ఇవి... ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి!
Vastu Tips For Happy Home: ఇంట్లో చికాకులు తొలగిపోయి సానుకూల శక్తి కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోండి. అన్నిటికన్నా ముందుగా ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవాలి...

Signs of Vastu Dosha: వాస్తు శాస్త్రం సానుకూల, ప్రతికూల శక్తులపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే సానుకూల శక్తి ఉంటుందో అక్కడ సంతోషం, ప్రసాంతత నిండి ఉంటుంది. ఐశ్వర్యానికి కొదవు ఉండదు, అనారోగ్య సమస్యలుండవు, వివాదాలుండవు..జీవితం మొత్తం ఆనందమయం అనేలా ఉంటుంది. అయితే ఎక్కడైతే ప్రతికూలశక్తి ఉంటుందో అక్కడ ప్రతి అడుగులోనూ ప్రతికూలతే ఎదురవుతుంది. ఇంట్లో వాస్తు నియమాలను పాటించకపోతే ఏర్పడేదే వాస్తు దోషం. వాటిపై మీకు పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నాలేకున్నా..మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని సూచిస్తాయి. అవేంటి? ఎలా తెలుసుకోవాలి? వాస్తు దోషానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
డబ్బు వృధా అయినప్పుడు
బాగా సంపాదిస్తారు కానీ చేతిలో డబ్బు నిలవదు. లక్షల్లో జీతం వస్తుంది కానీ నెల నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయ్. ఎంత ప్లాన్ ప్రకారం అడుగువేసినా మీ చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ ఇంట్లో వాస్తు దోషం ఉండవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బును ఆదా చేయలేకపోతున్నట్లయితే మీ ఇంటి నైరుతి దిశలో ఏదైనా వాస్తు దోషం ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీ ప్రధాన ద్వారం, కిటికీ దిశను మార్చాల్సి రావొచ్చు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
చేసిన పనులు దెబ్బతిన్నప్పుడు
మీరు ప్రారంభించిన పనులు దాదాపు పూర్తయ్యే పరిస్థితివరకూ వచ్చి అకస్మాత్తుగా దెబ్బతింటుంటాయి... విజయం వచ్చింది అనుకునే ఆఖరి క్షణంలో ఫలితాలు తారుమారు అయిపోతాయ్. ఇలాంటి పరిస్థితులు తరచూ ఎదరువుతున్నాయంటే మీ ఇంటి మధ్య భాగంలో ఏదైనా వాస్తు దోషం ఉండవచ్చు. ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం కాబట్టి ఇంటి మధ్య భాగంలో ఎలాంటి భారీ వస్తువును ఉంచకండి. ఇంటి ఈ భాగంలో తప్పుగా కూడా మరుగుదొడ్డిని నిర్మించకండి ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని నింపే్తాయి. దీని వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.
అనారోగ్య సమస్యలు
మీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇది కూడా వాస్తు దోషానికి సంకేతం. ఒకరు కోలుకున్నారు అనేసరికి మరొకరు అనారోగ్యం పాలవుతుంటారు. సంపాదించినది మొత్తం వైద్యులకే ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ఇది కూడ ఓ రకంగా వాస్తు దోషానికి సంకేతమే అంటారు వాస్తు నిపుణులు. ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచిన కొన్ని వస్తువులు ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ దిశను ఖాళీగా ఉంచడమే మంచిది అంటారు వాస్తు నిపుణులు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
వాస్తు అనేది కొన్ని పుస్తకాలు చదివి, ఫోన్లలో సంప్రదించి , వీడియోల్లో చూసి తెలుసుకోవాల్సినది అస్సలు కాదు. నేరుగా వాస్తు నిపుణులును ఆ ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు చెప్పిన వాస్తు మాత్రమే నూటికి నూరు శాతం సరైనది అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిక్కులు, మూలలు ఫోన్లో సమాచారం ఇచ్చి రైటా రాంగా అని అడిగినప్పుడు వారు చెప్పే విషయాలు పూర్తిస్థాయిలో కరెక్ట్ అని నమ్మేయడం వల్ల నష్టపోయేది మీరే. ఆ ప్రదేశంలో ప్రత్యక్షంగా వాస్తు నిపుణులు వచ్చి చెప్పినదే అసలైన వాస్తు...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా కొందరు పండితులు, పుస్తకాల నుంచి సకరించినది. దీనిని ఏబీపీ దేశం ధృవీకరించడం లేదు. వీటిని అనుసరించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

