Dharma Sandehalu: పూజ చేస్తున్నప్పుడు పాడు ఆలోచనలు వస్తున్నాయా.. అంటే అర్థం ఏంటో తెలుసా?
Spirituality: భగవంతుడి ఆరాధనలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయా? అలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయి? వాటినుంచి బయటపడడం ఎలా?

Spiritual Knowledge
పూజలో పాడు ఆలోచనలు వస్తున్నాయా?
ఆ ఆలోచనలు వస్తున్నాయని పూజ మానేస్తున్నారా?
అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయ్?
ఆ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి?
పుట్టుకతో ఎవరూ కారణజన్ములుకాదు.. చిన్నప్పటి నుంచి ఉండే సరదాలు, మీరు పెరిగిన వాతావరణం ప్రభావం మీపై తప్పనిసరిగా ఉంటుంది. జీవితంలో ఓ దశ దాటిన తర్వాత పూజ, ధ్యానం ప్రారంభించాలి అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో పూజపై, ధ్యానంపై దృష్టి నిలవదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఆదిశంకరాచార్యలు శివానందలహరిలో చెప్పిన శ్లోకం..
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ గిరౌ
నటత్యాశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యన్త చపలం
దృఢం భక్త్యా బధ్ద్వా శివ భవదధీనం కురు విభో ||
నా మనస్సు నిరంతరమూ మోహము అనెడి అరణ్యమునందు చరించుచు, యువతుల కుచగిరులపై నాట్యము చేయుచు, ఆశ అనెడి కొమ్మలపై వేగముగా అన్నివైపులకు స్త్వైర విహారము చేయుచున్నది. ఓ కపాలీ, ఓ ఆదిభిక్షూ, అత్యంత చపలమైన ఈ 'నా మనస్సు' అనే కోతిని, భక్తి అనే త్రాడుతో బలంగా కట్టివేసి, ఓ శివా, ఓ విభో, దానిని నీ స్వాధీనము చేసుకో
శంకరాచార్యులు చెప్పదలుచుకున్నది ఏంటంటే..మనస్సు అటు ఇటు పరిగెతుందని అల్లాడిపోవద్దు. కోతిలాంటి మనసుని శివుడికి అప్పగించేస్తే అలా పడి ఉంటుందని అర్థం.
మనసులో ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి
శరీరానికి రోగం వస్తే ..నిత్యం యోగా చేస్తారు, ప్రాణాయాణం చేస్తారు, వాకింగ్ చేస్తారు..కొన్నాళ్లకు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. అలాగనే మనసుకి కూడా అనవసర కొవ్వు చాలా చేరుతుంది. భగవంతుడిపై కొన్ని రోజులు లగ్నం చేస్తే అదే అలవాటు పడుతుంది.
సంభోజనం
మీరు తీసుకునే భోజనం కొన్ని రోజులు పోయిన తర్వాత మనసు లా మారుతుంది. నిర్మలమైన వ్యక్తి ఒకరు, కుతంత్రాలు ఉన్న వ్యక్తి ఒకరు.. ఇలాంటి వ్యక్తి మంచి వ్యక్తికి భోజనం వండి పెడితే మంచి వారు కూడా అలా మారిపోతారు. అన్నం వండేటప్పుడు ఎలాంటి భావాలు కలిగి ఉంటామో అవే అన్నంలోకి వస్తాయి. వాటిని తినేవారిపై అదే ప్రభావం పడుతుంది. అందుకే పూర్వకాలం ఎక్కడా భోజనం చేసేవారు కాదు. కేవలం అనుష్టానం చేసేవారి ఇంట్లో తింటారు. కుల ప్రాతిపదికన కాదు... అలాంటి ఇళ్లలో నిత్యం పూజ చేసి ప్రశాంతంగా వంట చేస్తారనే భావన. వండడమే కాదు తినేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా తినాలి. అప్పుడు మీ మనసు మారుతుంది
సాంగత్యం
ఎవరితో తిరుగుతున్నాం ఎవరితో ఉంటున్నాం అన్నదే సాంగత్యం. నిత్యం మన ఇంటికి వచ్చి కంప్లైంట్స్ చెప్పేవారుంటే మీ ఆలోచనలు మారిపోతాయి. ఆ ప్రభావం మీ ఆలోచనలపై పడుతుంది. అలాంటి వారిని దూరం పెట్టకపోతే మనసు నిలవదు. అందర్నీ దూరం చేసుకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. పాజిటివ్ ఆలోచనలుఉన్నవారితో స్నేహం చేస్తేమీ ఆలోచనలు మారుతాయి. భాగవతంలో సుధాముడిని కృష్ణుడు ఏం కావాలని అడిగితే..నీ పాదార్చకులతో స్నేహం చాలు కృష్ణ అన్నాడు. అలాంటి వ్యక్తుల సాంగత్యం పొందజం అదృష్టం
సాహిత్యం
మీరు చదివే పుస్తకాలు, మీరు చూసే వీడియోలు, సినిమాలు మీ మనసుపై ప్రభావం చూపిస్తాయి. వీలున్నంతవరకూ మనసుపై ప్రభావం చూపించే వీడియోలు చూడకుండా ఉండడం మంచిది. అందుకే పెద్దలంటారు పురాణాలకు సంబంధించిన పుస్తకాలు చదవమని. చికాకుగా ఉన్న సమయంలో భాగవతం కానీ, సుందరకాండ కానీ చదవండి. వేదంటే భక్తి సంబంధిత సినిమాలు వీడియోలు చూడండి.
ఈ మూడింటిని ప్రయత్నించి ఆచరించినప్పుడే పూజపై, భగవంతుడిపై మనసు నిలుస్తుందని సూచించారు పండితులు.
రామచంద్రుడి శ్లోకాలతో శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి






















