రాముడిని ఎవరు ఎలా పిలిచేవారు?

ప్రతి ఒక్కరికీ ఓ పేరు ఉంటుంది..కానీ ఇంట్లో అందరూ అదే పేరుతో పిలవరు

శ్రీరాముడిని కూడా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచేవారు

తండ్రి దశరథుడు..రామా అని పిలిచేవారు
తల్లి కౌసల్య... రామభద్రా అని పిలిచేది

రాముడిని అంత్యత ప్రేమగా పెంచిన పినతల్లి కైకేయి ..రామచంద్రా అనేది

సీతాదేవి తన భర్తని నాథా అని పిలిచేది

వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని వేదసే అని పిలిచేవారు
మహర్షులంతా రామయ్యని రఘునాథా అని పిలిచేవారు

అయోధ్య నగరవాసులంతా శ్రీరామచంద్రుడుని సీతాపతి అనేవారు

ఇవన్నీ కలిపి ఓ శ్లోకంగా మార్చారు

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||