శ్రీరామనవమి 2025 తేదీ, శుభముహూర్తం!

ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి...రామయ్య కల్యాణం అంటే ఊరూవాడా సంబరమే

ఏప్రిల్ 05 అర్థరాత్రి పన్నెండున్నర నుంచి ప్రారంభమైన నవమి తిథి ఏప్రిల్ 6 ఆదివారం రాత్రివరకూ ఉంది

ఏప్రిల్ 6 సూర్యోదయానికి నవమి తిథితో పాటూ పునర్వసు నక్షత్రం కూడా ఉంది

ఎలాంటి సందేహాలు లేకుండా ఏప్రిల్ 6 ఆదివారమే శ్రీరామనవమి జరుపుకోవాలి

స్వామివారి కల్యాణ మహోత్సవం మిట్టమధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది

ఏప్రిల్ 6 ఆదివారం మధ్యాహ్నం 12.23 సమయానికి సముహూర్తం ఉంటుంది

ఏప్రిల్ 7 సోమవారం దశమి రోజు రామయ్య పట్టాభిషేకం జరుగుతుంది

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఏడవది రామావతారం