శ్రీరామనవమి 2025: రియల్ హీరో రాముడు..ఎందుకంటే!

రాముడిని ఎంట్రీ గురించి చెబుతూ అయోధ్య కాండలో వాల్మీకి మహర్షి ఓ శ్లోకం రాశారు

కథంచిదుపకారేణ కృతేనై కేన తుష్యతి
న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా

హీరో అంటే ఇలా ఉండాలని చెప్పే శ్లోకం ఇది

ఎవరైనా ఒకే ఒక ఉపకారం చేస్తే ఆజన్మాంతం గుర్తుపెట్టుకుంటాడు

వంద అపకారాలు చేసినా కానీ ఆక్షణమే మరిచిపోతాడు

ఇలాంటి గుణం కలిగినవాడు రాజు అయినప్పుడే ఆ పాలన బావుంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు

ఇప్పటితరం ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకదా...

ఎన్ని ఉపకారాలు చేసినా మరిచిపోతారు..ఒక్క అపకారం చేస్తే గుర్తుంచుకుంటారు

అందుకే రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు