Sri Rama Navami 2025: రామకోటి రాసేటప్పుడు చేయకూడని తప్పులు, పాటించాల్సిన నియమాలు ఇవే!
Rama Koti Writing: రామకోటి రాయాలన్న తపన చాలామంది భక్తుల్లో ఉంటుంది. అయితే అది రాయాలంటే ఏ నియమాలు పాటించాలి? రాసిన పుస్తకాలను ఏం చేయాలి?

Sri Rama Navami Special Rama koti: శ్రీరామచంద్రుడి భక్తులకు రామకోటి రాయాలనే తపన ఉంటుంది. రామకోటి రాయాలని అనుకోవడమే ఓ సత్కార్యం. ముందుగా రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని దేవుడి దగ్గర ఉంచండి.గళ్ల పుస్తకం అయినా, తెల్ల పుస్తకం అయినా పర్వాలేదు. మంచిరోజు చూసుకుని పసుపు, కుంకుమ రాసి దేవుడి సన్నిధిలో ఉంచి పూలతో పూజచేయాలి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని గ్రంధంలా భావించి కళ్లకు అద్దుకుని రాయడం ప్రారంభించండి. ఆ పని శ్రీరామనవమితో ప్రారంభిస్తే ఇంకా మంచిది.
1. రామకోటి రాయాలి అనుకున్నవారు శ్రీరామనవమి రోజు పుస్తకాన్ని తీసుకెళ్లి పూజలో పెట్టి అప్పుడు రాయడం ప్రారంభించండి. దానిని ఓ నోట్ బుక్ లా చూడొద్దు.. మహత్తర గ్రంధంలా భావించండి.
2. శ్రీరామ అంటే సీతమ్మ - రాములవారు కలసి అని అర్థం..అందుకే శ్రీరామ అని రాయండి....రామ రామ అని కాదు...
3. రామకోటి రాసే పుస్తకంలో మరే ఇతర వివరాలు రాయొద్దు.. ఫోన్ నంబర్లు,, అడ్రస్ లు రాయడం లాంటివి కొందరు చేస్తారు. ఆ పుస్తకాన్ని మందిరంలోనే ఉంచండి
4. రామకోటి సంఖ్య కోసం రాయొద్దు...మీ మనసు ఎంతసేపు లగ్నం చేయగలిగితే అంతవరకే రాయిండి. ఏ క్షణం అయితే మనసు లగ్నం చేయలేరో అప్పుడు ఆపేయండి. ఎన్నిరాసినా కూడా మనసుపెట్టి రాయండి. కౌంట్ కోసం భక్తి ప్రదర్శించవద్దు
5. రామకోటి రాసేటప్పుడు మధ్యలో ఆపాల్సి వస్తే బేసి సంఖ్య దగ్గర ఆపండి..సరి సంఖ్య దగ్గర వద్దు
6. లక్ష రాయగలిగినా సంతోషమే..భక్తి శ్రద్ధలతో ఈ నంబర్ కి చేరుకున్నా కానీ మీ జీవితంలో మీరు ఊహించని మార్పులొస్తాయి ( కోపం, అహం, దురలవాట్లు, దుర్భుద్ధి...ఇలా మీలో ఉండే చెడు అలవాట్లు మాయమైపోతాయి). పూర్తి చేసిన ప్రతి లక్షకు ఆ పుస్తకానికి పూజ చేసి ప్రసాదం మీ చుట్టుపక్కవారికి పంచండి
7. రామకోటి రాసే పుస్తకాన్ని ఎక్కడైనా ఓ చోటుకి చేర్చండి. మన తర్వాత తరానికి ఆ పుస్తకం విలువ తెలియకపోతే అన్ని రఫ్ బుక్స్ తో పాటూ పడేస్తారు లేదంటే అమ్మేస్తారు. అందుకే వయసు పెద్దగా అయిపోతుంది అన్నప్పుడు ఆ పుస్తకాన్ని భగవంతుడి సన్నిధికి చేర్చి..ఆ తర్వాత ఇంకా మీరు కొనసాగించవచ్చు. రామకోటి రాసిన పుస్తకాన్ని కుదిరితే భద్రాచలంలో ఇవ్వండి లేదంటే గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి పుస్తకాలు భద్రపరుస్తారు. వాళ్లకి తీసుకెళ్లి ఇవ్వొచ్చు లేదంటే పోస్టల్ లో పంపించవచ్చు. ఇంకా అవకాశం లేదంటే పసుపు వస్త్రంలో చుట్టి ఓ నదిలో కలిపేయండి.
రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అని ఏమీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత అవసరం. నిద్రవచ్చినప్పుడు బలవంతంగా రాయొద్దు..ఆపేసి మళ్లీ ప్రశాంతంగా ప్రారంభించండి. ఏదో మొక్కుబడిగా పూర్తిచేసేస్తే చాలు అని రాయొద్దు...భక్తి ప్రధానం...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















