Ram Navami 2025: శ్రీరామనవమి సందర్భంగా రామాయణ పారాయణం రెండో రోజు - అయోధ్యకాండ!
Ayodhya Kanda in Telugu: ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు...ఈ 9 రోజులు ప్రతి ఇంట్లోనూ రామాయణం పారాయణం చేస్తారు. రెండో రోజు చేయాల్సిన పారాయణ ఇది..

Ram Navami Special 2025
సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం మొదటి రోజు బాలకాండ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం రెండో రోజు అయోధ్య కాండ మొదలు... (Ayodhyakanda)
కోసలదేశం అయోధ్యా నగరం సర్వశోభాయమానంగా అలంకంరించారు. మిథిలానగరం నుంచి వచ్చిన పెళ్లి వారందరికీ ఆతిథ్యం అందించారు. వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం నూతన దంపతులకు జరిపించవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. రాజ్యంలో ప్రజలంతా ఉత్సవాలు జరుపుకున్నారు. భరతుడు, శత్రుఘ్నడు తమ తాతగారి ఇంట్లో ఓ రోజు ఉండివచ్చేందుకు వెళ్లారు. రాముడి శౌర్య ప్రతాపాలను ప్రజలు కొనియాడుతున్నారు. అదే సమయంలో దశరథుడు...మంత్రి, సామంత , పురోహిత, దండనాదులతో సమావేశం ఏర్పాటు చేశాడు. తనకు వయసు పైబడిన రీత్యా రామచంద్రునికి రాజ్యభారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఉందన్నాడు. సరే శ్రీరామ పట్టాభిషేకం జరిపిద్దాం అన్నారంతా. మహారాజు అందరకీ అభివాదం చేసి కులగురువులు వశిష్ఠుడి వైపు చూసి పట్టాభిషేకానికి సుమూహూర్తం నిర్ణయించమని కోరాడు. పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తం నిర్ణయించి రేపే పట్టాభిషేకం అన్నారు. వెంటనే రామచంద్రుని సభామందిరానికి పిలిపించి పట్టాభిషేకం గురించి చెప్పాడు. రాముడు తండ్రికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్లి తల్లి కౌసల్యకు ఈ విషయం చెప్పాడు. పట్టాభిషేకానికి వ్రతదీక్షను తమచేత పూర్తిచేయించాల్సిందిగా కోరాడు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కైక- దశరథుడి వరాలు
అయోధ్య వాసులంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. అదే సమయంలో కైకేయి దాసి మంధర ఈ ఉత్సవాల హడావుడి చూసి విషయం ఏంటా అని ఆరాతీసింది. పట్టాభిషేకం గురించి తెలుసుకుని కైకేయి మందిరానికి వెళ్లింది మంధర. అంతా అయిపోయింది. రామచంద్రుడు రాజుకాబోతున్నాడు. భరతుడు రాజుకావాల్సింది అని నూరిపోసింది..గతంలో దశరథుడు గతంలో కైకేయికిఇచ్చిన రెండు వరాలు గుర్తుచేసింది. కైకేయికి ఇష్టం లేకపోయినా మంథర మాటలు క్రమంగా పనిచేసి అలక మందిరానికి వెళ్లిపోయింది. దశరధుడు అలక మందిరం చేరుకుని విషయం తెలుసుకుని బాధపడ్డాడు. కైకేయిని బ్రతిమలాడాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ కైకేయి మాత్రం భరతుడి పట్టాభిషేకం జరగాలని పట్టుబట్టింది. రాముడు 14 సంవత్సరాలు అరణ్య వాసం చేయాలని, నారబట్టలు కట్టి సంచరించాలని కోరింది. కైకేయి మాటలకుదశరథుడు మూర్ఛపోయాడు.
రామ పట్టాభిషేకానికి పనులుసాగుతున్నాయి. ఇంతలోనే కైకేయి రాముడిని పిలిపించి దశరథుడు తనకు ఇచ్చిన వరాల గురించి తెలియజేసింది. అమ్మా..నాన్నగారు స్వయంగా ఈ విషయం చెప్తేనేను కాదంటానా..వారు ఆదేశిస్తే ప్రాణాలైనా విడవడానికి నేను సిద్ధమే కదా అన్నాడు. లక్ష్మణుడికి ఈ వార్త తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. కౌసల్యా ఈ విషయం తెలుసుకుని తల్లడిల్లింది. అరణ్యవాసానికి సిద్ధపడిన రాముడితో పాటూ బయలుదేరాడు లక్ష్మణుడు. సీతమ్మ కూడా స్వామి వెంటే బయలుదేరింది. సుమంత్రుడు తీసుకొచ్చిన రథంలో సీతా, రామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు.
రామచంద్రడు లేని అయోధ్యలో ఉండలేమంటూ రథం వెంట బయలుదేరారు కొందరు. సాయంత్రానికి ఓ నది ఒడ్డుకుచేరి అక్కడ విశ్రమించారు. జనం కూడా అక్కడ విశ్రమించారు. రాత్రి పొద్దుపోయాక, సుమంత్రా ఈ జనం ఇలాగే నాతో అడవికి వచ్చేలా ఉన్నారంటూ వాళ్లంతా నిద్రలేవకముందే బయలుదేరాలి అని చెప్పి అక్కడి నుంచి గంగానదీ తీరం చేరారు. గుహుడు వారికి స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు. సుమంత్రుడికి చెప్పవలసిన జాగ్రత్తలుచెప్పి వీడ్కోలు పలికాడు రాముడు. సీతారామ లక్ష్మణులు గుహుడు ఏర్పాటుచేసిన పడవలో గంగానది దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. వారు కంటికి కనిపించనంత దూరం వరకూ వారిని చూస్తేనే ఉండి వెనక్కు తిరిగివచ్చాడు గుహుడు. సీతా,రామలక్ష్మణులు అలాఅరణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు. సర్యాస్తమయ వేళకు ప్రయాగకు సమీపంలో ని భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. మహర్షికి నమస్కరించి వారి ఆతిథ్యం స్వీకరించారు. అక్కడి నుంచి మాల్యవతీ తీరం చేరి చిత్రకూట ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అయోధ్యలో అంతా భారమైన హృదయంతో ఉన్నారు. ఒంటరిగా వచ్చిన సుమంత్రుడిని చూసి దశరధుడు మూర్ఛపోయాడు. పుత్రశోకంతో దశరధుడు ఆ రాత్రి కన్నుమూశాడు. తాతగారి భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్యప్రవేశిస్తూనే జరగరానిదేదో జరిగిందని గమనించారు. తండ్రిమరణవార్త విని తల్లడిల్లారు. జరిగిన విషయం తెలుసుకుని రాముడిని వెతుక్కుంటూ వెళ్లాడు. గుహుడి సాయంతో గంగా నదిని దాటి.. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. రాముడికి తిరిగి సింహాసనం అప్పగించేందుకు భరతుడు వచ్చాడని తెలిసి భరద్వాజ మహర్షి సంతోషించాడు. రాముడు చిత్రకూటంలో నివశిస్తున్నాడని చెప్పాడు. శ్రీరాముడిని చేరుకోగానే భరత,శతృఘ్నలు పాదాలపై పడ్డారు. తండ్రి గారు ఎలా ఉన్నారని అడిగి రాజధర్మం సక్రమంగా నిర్వర్తిస్తున్నావా అడి అడిగాడ. ఇంకెక్కడి తండ్రి అన్నయ్యా అంటూ మరణవార్త చెప్పాడు. తిరిగి రాజ్యానికి రమ్మని వేడుకున్నాడు రాముడు సున్నితంగా తిరస్కరించడంతో పాదుకలు తీసుకుని అయోధ్యకు తిరుగుపయనం అయ్యాడు భరతుడు.
అరణ్యవాసంలో ఉన్న రామచంద్రుడు చిత్ర కూటం నుంచి అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆతిథ్యం పొందారు. ఆ రాత్రి అక్కడ విడిది చేసి మరునాడు వారు ముందుకు కదిలేందుకు సిద్ధమయ్యారు. మీరు వెళ్లే దారిలో రాక్షసులు ఉంటారు జాగ్రత్త అంటూ మహర్షులు సూచన చేశారు. వారికి ప్రణమిల్లి సీతా,రామ లక్ష్మణులు అరణ్యమార్గంలో ముందుకు సాగారు.
( అయోధ్యకాండ సమాప్తం)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















