అన్వేషించండి

Stock Market Crash: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్‌ మండే: సెన్సెక్స్ 1100, నిఫ్టీ 330 పాయింట్లు పతనంతో స్టాక్ మార్కెట్ ఓపెన్

Sensex Crashes | అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ పతనం చూశాయి. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు కూలగా, నిఫ్టీ 1% పైగా పడిపోయింది. ఆయిల్‌ ధరలు ఎగసిపడడం ఆందోళన కలిగిస్తోంది.

Sensex Crash Today:  డాలాల్‌ స్ట్రీట్‌లో ఈ సోమవారం ఉదయం గట్టి షాక్‌ తగిలింది. అమెరికా-ఇరాన్‌ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు గ్లోబల్‌ మార్కెట్లను కుదిపేయడంతో భారత స్టాక్‌ మార్కెట్లు కూడా భారీ పతనం చూశాయి.

ఈ రోజు (సోమవారం, 02 మార్చి 2026) ఉదయం BSE సెన్సెక్స్‌ 3.4% లేదా 2,743 పాయింట్ల భారీ నష్టంతో 78,543 వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ కూడా 2.06% or 519 పాయింట్ల పతనంతో 24,659 వద్ద ప్రారంభమైంది, 1 శాతం పైగా గ్యాప్‌-డౌన్‌ అయింది.

ప్రి-ఓపెన్‌ సెషన్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపించింది. ఉదయం 9:06 గంటలకు సెన్సెక్స్‌ 78,222.53 వద్ద ఉంది, 3,064 పాయింట్ల నష్టాన్ని చూపింది. అదే సమయానికి నిఫ్టీ 24,630.80 వద్ద 2 శాతం పైగా నష్టంతో కనిపించింది.

విస్తృత మార్కెట్ సూచీలు కూడా లోయర్‌ లెవెల్స్‌లో ట్రేడవుతున్నాయి, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 దాని మునుపటి ముగింపు 59,115.60 తో పోలిస్తే ఇవాళ 57,090.80 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్100 దాని మునుపటి ముగింపు 16,928.90 కంటే 16,289.60 వద్ద ప్రారంభమైంది. 

సెగ్మెంట్‌లలో - నిఫ్టీ రియాల్టీ అతి పెద్ద నష్టాలను మిగిల్చింది. దీని తర్వాత నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ సూచీలు దిగజారాయి.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై దాడులు జరిపింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ‘రిస్క్‌ ఆఫ్‌’ మూడ్‌లోకి వెళ్లిపోయారు. సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆసియా మార్కెట్లు కూడా కుదేలు

జపాన్‌ నిక్కీ 225 దాదాపు 2.7 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పీ 2.43 శాతం నష్టపోయింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా బలహీన సంకేతాలిచ్చాయి. గ్లోబల్‌ సెంటిమెంట్‌ ఎంత బలహీనంగా ఉందో ఇవి చూపిస్తున్నాయి.

ఎగసిపడిన ఆయిల్‌ ధరలు

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 72.87 డాలర్లకు చేరింది, ఒకేసారి 2.87 శాతం పెరిగింది. భారత్‌, తన క్రూడ్‌ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్‌ ధరలు ఎక్కువకాలం పెరిగి ఉంటే, ఆ ప్రభావం వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై పడే అవకాశం ఉంది.

ఆర్థిక నిపుణుల ప్రకారం... ఆయిల్‌ ధరలు స్థిరంగా పెరిగితే ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ప్రభుత్వ ఆర్థిక లోటు కూడా పెరుగుతుంది.

రేపు (మంగళవారం) హోలీ సందర్భంగా మార్కెట్లు మూసివేస్తారు. అందుకే, తక్కువ పని రోజులు ఉన్న ఈ వారంలో ఎక్కువ అస్థిరత ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయంగా మూడో త్రైమాసిక GDP గణాంకాలు, ఆటో సేల్స్‌ డేటా, IIP, PMI వంటి డేటా రిలీజ్‌లు మార్కెట్‌ దిశను ప్రభావితం చేయొచ్చు. విదేశీ పెట్టుబడుల ట్రెండ్‌ కూడా కీలకం.

గత వారంలో సెన్సెక్స్‌ 1,527 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయింది. టెక్నాలజీ షేర్లలో బలహీనత, గ్లోబల్‌ అనిశ్చితి ఇప్పటికే మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి.

భవిష్యత్‌లో ఏం జరగొచ్చు?

మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత విషమిస్తే మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు. ఆయిల్‌ ధరలు ఇంకా పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగొచ్చు.

ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు టెన్షన్‌ పడకుండా దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget