Shree Siddhivinayak Bhagyalakshmi: ఈ ఆలయంలో వినాయకుడి ఆదాయం రూ.133 కోట్లు - ఆడపిల్లల తల్లుల అకౌంట్లో ఎంత పడుతుందో తెలుసా !
Shree Siddhivinayak Temple: ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయ వార్షిక ఆదాయం 133 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈమొత్తాన్ని ఏం చేస్తున్నారో తెలుసా?

Shree Siddhivinayak Temple Reports Record Income: ముంబైలో ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధివినాయక ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. లక్షల మంది భక్తులు దర్శించుకునే ఆ ఆలయం ముంబైలో పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. సామాన్య ప్రజల నుంచి కోటీశ్వరుల వరకు ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. ఇక్కడ శ్రీ సిద్ధివినాయకుడి ఆదాయం ఎంతో తెలుసా...2023-24 ఆర్థిక సంవత్సరంలో సిద్ధివినాయక ఆలయం రూ. 133 కోట్ల రికార్డు ఆదాయాన్ని సాధించింది. ఇది ఇప్పటివరకు సంవత్సరానికి అత్యధిక ఆదాయం.
బెల్లా జయసింఘానీ నివేదిక ప్రకారం, 2023-24లో రూ. 114 కోట్ల ఆదాయం వచ్చింది, కానీ 2024-25లో 15% పెరిగి రూ. 133 కోట్లకు చేరింది. తదుపరి ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో సిద్ధివినాయక ఆలయం యొక్క వార్షిక ఆదాయం రూ. 154 కోట్లకు పెరుగుతుందని అంచనా.
ఆలయ నిర్వహణ విషయంలో నగదు నుంచి, ఆన్‌లైన్ లావాదేవీలు, బంగారం-వెండి ద్వారా భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుదలతో పాటూ ఆన్ లైన్ ద్వారా స్వామికి మొక్కులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆదాయం మరింత పెరిగింది.
ఆలయానికి బంగారం-వెండి ద్వారా రూ. 7 కోట్లు, హుండీ నుంచి రూ. 98 కోట్లు నగదు, పూజా బుకింగ్ ప్రసాదం సహా ఇతర వనరుల నుంచి రూ. 10 కోట్లు లభించాయి.
సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ ద్వారా వచ్చే ఈ డబ్బులను ఆలయ నిర్వహణ, భద్రత, విస్తరణ పనులతో పాటు విద్య, వైద్య సదుపాయాలు, పేదలకు సహాయం మరియు సామాజిక సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తారు. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో వచ్చిన ఆదాయం విషయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు
ముంబై ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ఆడపిల్లల కోసం FD పథకాన్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బాలికకు 10 వేలు చొప్పున డిపాజిట్ చేయబోతున్నట్టు వివరించారు ఆలయ నిర్వాహకులు. ఈ మేరకు భాగ్య లక్ష్మీ పథకాన్ని రూపొందించి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతీ అమ్మాయికి ట్రస్ట్ ద్వారా 10వేలు FD చేస్తుందన్నారు. అయితే ఈ డబ్బులను ఆడ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఆలయ ట్రస్టులు ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటి సారి అని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.
సిద్ధివినాయక ఆలయంలో ఏటా గణేష్ చతుర్థి , ఇతర సందర్భాలలో బాలీవుడ్ నటుల నుంచి వ్యాపారవేత్తల వరకు లక్షల మంది భక్తులు వస్తారు. శ్రీ సిద్ధివినాయక ఆలయంలానే మన దేశంలో ఇతర మతపరమైన ప్రదేశాల్లోనూ వందలకోట్ల ఆదాయం వచ్చే ఆలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారి ఆలయమే ఇందుకు ఉదాహరణ. శ్రీ వేంకటేశ్వరుడి వార్షిక ఆదాయం దాదాపు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1650 కోట్ల వరకు ఉంటుంది. కేరళలో అనంత పద్మనాభస్వామి ఆలయం వార్షిక ఆదాయం ఏటా రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

