Heart Disease and Diabetes : మధుమేహమున్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. లేకుంటే గుండె ప్రమాదాలు తప్పవట
Diabetes Heart Health Tips : డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టిప్స్ ఫాలో అయితే రెండూ కంట్రోల్ అవుతాయంటున్నారు.

Heart Disease Prevention for Diabetics : మధుమేహం వస్తే బీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అంటారు. ఇది కేవలం బీపీనే కాదు పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గుండెను నెగిటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుందని.. జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే.. అది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ ఇది క్రమేణా గుండెను నియంత్రించే నరాలపై ప్రభావం చూపిస్తుంది. మధుమేహం పెరిగే కొద్ది గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. హార్ట్ ఫెయిల్యూర్, హై బీపీ, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వచ్చే అవకాశముంది.
మధుమేహం లేనివారితో పోలిస్తే.. మధుమేహమున్నవారికి 2 నుంచి 4 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. రక్తంలోని అధిక చక్కెర రక్తనాళాలు దెబ్బతీసి గుండె సమస్యుల పెంచుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం కొలెస్ట్రాల్‌తో ముడిపడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మధుమేహం వల్ల వచ్చే వాపు గుండె, ధమనులకు హాని కలిగించి సమస్యలు రెట్టింపు చేస్తుంది. అందుకే మధుమేహమున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేవలం గుండె ఆరోగ్యమే కాదు.. పూర్తి శరీరానికి మంచిదని చెప్తున్నారు నిపుణలు. అవేంటో చూసేద్దాం.
రెగ్యులర్ చెకప్స్..
షుగర్ సమస్య ఉంటే రెగ్యులర్‌గా రక్తంలోని చక్కెర ట్రాక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల గుండెను నియంత్రించే రక్తనాళాలపై ప్రభావం పడకుండా ఉంటుంది.
కొలెస్ట్రాల్ కంట్రోల్
డయాబెటిస్ ఉన్నవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ రెండూ కలిసి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి కాబట్టి. డయాబెటిస్‌ను, బీపీని కంట్రోల్లో ఉంచడానికి వైద్య సహాయం తీసుకుంటూ లైఫ్స్టైల్లో మార్పులు చేయాలి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తినాల్సినవి
మధుమేహం, బీపీ ఉన్నవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా అది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి కొన్ని ఫుడ్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఉప్పు, పంచదార, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
యాక్టివ్‌గా ఉండండి..
రోజులో అరగంట అయినా వ్యాయామం చేయండి. మధుమేహమున్నవారు బరువు తగ్గడంపై ఫోకస్ చేయాలి. లేదంటే గుండె సమస్యల ప్రమాదం రెట్టింపు అవుతుంది. కాబట్టి వ్యాయామం చేయడం కుదరకుంటే కనీసం బ్రిస్క్ వాకింగ్ చేయండి. దీనివల్ల యాక్టివ్‌గా ఉంటారు. ఇది మధుమేహాన్ని, బరువును, బీపీని కంట్రోల్లో ఉంచడంలో సహాయం చేస్తుంది.
స్మోకింగ్ వద్దు..
మధుమేహమున్నవారు స్మోకింగ్‌ని వీలైనంత త్వరగా మానేయాలి. ఇది గుండెను అన్ని రకాలుగా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. బీపీని పెంచి గుండెను డ్యామేజ్ చేస్తుంది. షుగర్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేయకపోతేనే మంచిది. ఇది గుండెతో పాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
ఒత్తిడి..
ఒత్తిడి వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బీపీ ఎక్కువయ్యే అవకాశముంది. ఈ రెండు గుండెపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి స్ట్రెస్‌ని తగ్గించుకునే టిప్స్ ఫాలో అవ్వండి. నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా యోగా, ధ్యానం, బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా స్ట్రెస్ రిలీఫ్ ఇస్తాయి.
ఇవేకాకుండా వైద్యులు సూచించిన మందులు కచ్చితంగా ఉపయోగించాలి. వారు ఫుడ్ విషయంలో ఇచ్చే సూచనలు, లైఫ్ స్టైల్లో చేయమన్న మార్పులు కూడా కచ్చితంగా చేయాలి. గుండె దగ్గర నొప్పిగా ఉన్నా.. బ్రీతింగ్లో ఇబ్బందులు, కాళ్లు-చేతుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోండి. దీనివల్ల గుండె హెల్తీగా ఉంటుంది. మధుమేహమున్నా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.






















