అన్వేషించండి

TG SSC Results: 'టెన్త్' ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్ - ఎప్పుడంటే?

SSC Results: పదో తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

Telangana SSC Results: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రెండు లేదా మూడురోజులలో వెలువడనున్నాయి. మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించడంతో.. ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి మార్కుల మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా.. దాదాపు 20 రోజులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ విద్యాసంవత్సరం నుంచి పదోతరగతిలో గ్రేడింగ్‌ విధానాన్ని తీసేసినట్లయింది. 

ఇప్పటివరకు పదోతరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడ్లతోపాటు.. క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్(CGPA) ఇచ్చేవారు.  ఇక మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. గ్రేడ్లస్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్‌ను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం ఆలస్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్‌ ఉంటాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇకనుంచి సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. జీపీఏ అనేది ఇవ్వరు. మార్కులమెమోలపై సబ్జెక్టులవారీగా.. రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. 

ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి..
పదో తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవీ నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మెమోల ముద్రణ ఇలా..
* పదోతరగతి మెమోలపై ఇంటర్నల్స్‌ మార్కులు, వార్షిక పరీక్షలు మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులతో పాస్‌ సర్టిఫికెట్‌ జారీచేస్తారు. గ్రేడ్లు, మార్కులను వేర్వేరుగా ముద్రిస్తారు.
* సబ్జెక్టులవారీగా సాధించిన మార్కు లు, గ్రేడ్లు రెండింటిని సర్టిఫికెట్‌లో ముద్రిస్తారు.
* పదోతరగతిలో ఇంటర్నల్స్‌లో 20 మార్కులు కేటాయించారు. ఈ పాఠ్య కార్యక్రమాలకు కూడా గ్రేడ్లు ఇస్తారు. ఎస్సెస్సీ పాస్‌ సర్టిఫికెట్‌లో చూపుతారు.
* పదోతరగతి వార్షిక పరీక్షలను ప్రస్తుతం ఒక సబ్జెక్టులో 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో 28 మార్కులొస్తేనే పాసైనట్టు లెక్క. 
* ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులొచ్చినా వార్షిక పరీక్షల్లో 28 మార్కులు సాధించాల్సిందే. హిందీలో 16 మార్కులొస్తే పాస్‌ అయినట్టు.
* మెమోలపై ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి అంటూ ఏముండదు. ఎన్ని మార్కులొచ్చినా పాస్‌ అనే ముద్రిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget