AP SSC Supplementary Exam 2025: ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు వచ్చేశాయ్
AP 10th Results 2025 ఏపీలో టెన్త్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఫెయిలైన విద్యార్థులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

AP SSC Supplementary Exam Date 2025: ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఏడాది 4,98,585 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. 81.14శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై అప్డేట్ ఇచ్చారు.
సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు
ఏపీలో మే నెలలో టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షలలో ఫెయిలయిన విద్యార్థులు బాధ పడొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నాలుగు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రీ కౌంటింగ్, వెరిఫికేషన్.. సప్లిమెంటరీ ఫీజులు చెల్లింపుల వివరాలు
అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో పరీక్ష ఫీజు చెల్లింపులను HM లాగిన్ ద్వారా 24-04-2025 నుంచి 30-04-2025 వరకు ఆలస్య రుసుము (ఫైన్) లేకుండా 01-05-2025 నుంచి 18-05-2025 వరకు ₹50 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. సమాధాన పత్రాల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 24-04-2025 (ఉదయం 10:00) నుండి 01-05-2025 (రాత్రి 11:00) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు ₹500, రివెరిఫికేషన్ ఫీజు సబ్జెక్టుకు ₹1,000. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని సూచించారు. CFMS సిటిజన్ చలాన్ ద్వారా చెల్లింపులు అంగీకరించరని స్పష్టం చేశారు.
• దరఖాస్తు ప్రక్రియలో సర్టిఫికెట్‌ను ఎంచుకున్న అభ్యర్థులకు, ఫలితాలు ప్రకటించిన 4 రోజుల తర్వాత డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికెట్‌లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా హెడ్ మాస్టర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. వీటిని విద్యార్థులకు వారి సబ్జెక్టుల వారీగా మార్కుల మెమోలతో పాటు జారీ చేయాలి. అసలు SSC పాస్ సర్టిఫికెట్‌లను సకాలంలో స్కూళ్లకు పంపుతారు. ప్రతి సర్టిఫికెట్‌పై సంతకం చేసిన తర్వాత విద్యార్థులకు ఈ సర్టిఫికెట్‌లను జారీ చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలని విద్యాశాఖ తెలిపింది.






















