అన్వేషించండి

AP SSC Results 2025: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Andhra Pradesh 10th Results 2025: ఏపీలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు టెన్త్ ఫలితాలను ఒక్క క్లిక్ ద్వారా ఇక్కడ చెక్ చేసుకోండి.

రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసిన వారిలో 81.14 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని విద్యాశాఖ తెలిపింది. టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరైన 6,14,459 మంది విద్యార్థులు కాగా, వీరిలో 4,98,585 మంది విద్యార్థులు పాసయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో, ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.. 

93.90శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో మన్యం జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 1680 ఉన్నాయి. ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.  ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు.

అభ్యర్థులు టెన్త్ ఫలితాల కోసం వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలు ఎంచుకుని, ఆపై టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ ద్వారా టెన్త్ క్లాస్ ఫలితాల PDF కాపీని పొందవచ్చు.

 

టెన్త్ రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి హైలైట్స్.. 
• అభ్యర్థులను సమర్పించిన మొత్తం పాఠశాలల సంఖ్య: 11,819
• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు : 6,14,459
• రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం (రెగ్యులర్ అభ్యర్థులు): 81.14%
• బాలురు ఉత్తీర్ణత శాతం: 78.31%
• బాలికలు ఉత్తీర్ణత శాతం: 84.09%
• బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 5.78% ఎక్కువ.
• మొత్తం 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత రేటును సాధించాయి.
• 19 పాఠశాలలు 0% ఉత్తీర్ణత రేటును నివేదించాయి.
• పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని 93.90%తో నమోదు చేసింది.
• అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64%తో అత్యల్ప ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది.
• ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 95.02%తో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి.
• డివిజన్ వారీగా విద్యార్థుల ఫలితాలు ఇలా ఉన్నాయి. 65.36% మంది ఫస్ట్ డివిజన్, 10.69% మంది సెకండ్ డివిజన్, 5.09% మంది థర్డ్ డివిజన్ సాధించారు.

2015 నుండి 2025 వరకు సంవత్సం వరకు పనితీరులో 2019 వరకు స్థిరమైన ఉత్తీర్ణత రేట్లు 90% కంటే ఎక్కువగా ఉన్నాయి. మహమ్మారి సంబంధిత కారణంగా 2020, 2021లో 100% ఉత్తీర్ణత శాతాలు ఉన్నాయి. 2022లో అత్యల్ప ఉత్తీర్ణత రేటు (67.26%), ఆ తర్వాత 2025లో క్రమంగా కోలుకుని ఏకంగా 81.14%కి చేరుకుంది.
• SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 19-05-2025 నుండి 28-05-2025 వరకు షెడ్యూల్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget