అన్వేషించండి

Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!

Free Online Courses India: ఫ్రీగా ఏఐ కోర్సు నేర్చుకోవాలన్నా, లేదా ఇతర ఏదైనా ఐటీ స్కిల్ నేర్చుకోవాలన్నా సరే కొన్ని యాప్‌లలో నేర్చుకోవచ్చు. సర్టిఫికెట్స్‌ కూడా ఇస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్వయం ప్లాట్‌ఫామ్‌లో 18,500 పైగా ఉచిత కోర్సులు లభిస్తాయి.
  • దీక్ష, ఈ పాఠశాల పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందిస్తాయి.
  • ఎన్‌పీటీఈఎల్, స్కిల్ ఇండియా డిజిటల్ నైపుణ్య కోర్సులను అందిస్తాయి.
  • నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పరిశోధనకు అవసరమైన సమాచారం లభిస్తుంది.

Free Online Courses India: డిజిటల్ యుగంలో చదువుకోవాలనే కోరిక ఉండాలే కానీ, వనరులకు కొదవలేదు. ముఖ్యంగా భారత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో అద్భుతమైన ఉచిత ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి తెచ్చింది. గతంలో నాణ్యమైన విద్య కేవలం పట్టణాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మారుమూల పల్లె విద్యార్థులు కూడా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి నేరుగా పాఠాలు వినే అవకాశం కలిగింది. నేషనల్‌ ఎడ్యుకేషన్ పాలసీ 2020, పీఎం ఈ విద్య వంటి పథకాల ద్వారా దేశంలో విద్యను అందరికీ చేరువ చేసేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. 

స్వయం(Swayam)

ప్రభుత్వం ఈ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో స్వయం చాలా ముఖ్యమైంది. ఇందులో 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు సుమారు 18,500 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌,మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్‌ వంటి అనేక విభాగాల్లో ఐఐటీలు, ఐఐఎం ప్రొఫెసర్లు ఇక్కడ పాఠాలు చెబుతారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు నెర్చుకున్న కోర్సులద ద్వారా లభించే క్రెడిట్లు మీ యూనివర్శిటీ డిగ్రీలకు బదిలీ చేసుకోవచ్చు. కోర్సు నేర్చుకోవడం పూర్తిగా ఉచితం, అయితే మీకు గుర్తింపు పొందిన సర్టిఫికెట్స్‌ కావాలంటే మాత్రం సుమారు వెయ్యి రూపాయలు చెల్లించాలి పరీక్ష రాయాలి. 

దీక్ష, ఈ పాఠశాల

పాఠశాల విద్యార్థుల కోసం దీక్ష , ఈ పాఠశాల అద్భుతంగా పని చేస్తున్నాయి. దీక్షా పోర్టల్‌ ద్వారా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌కు సంబధించిన డిజిటల్‌ పాఠ్యపుస్తకాలు, వీడియోలు,క్విజ్‌లు 15 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం తక్కువ ఇంటర్నెట్‌ వేగంతో కూడా పని చేసేలా దీనిని రూపొందించారు. అలాగే పీఎం-ఈ విద్య ద్వారా టీవీ ఛానెళ్లు, రేడియో ద్వారా కూడా పాఠాలు బోధిస్తున్నారు. ఇది ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. 

ఎన్‌పీటీఈఎల్‌

టెక్నికల్‌ విద్యపై ఆసక్తి ఉన్న వారికి ఎన‌పీటీఈఎల్‌ ఒక వరం. ఐఐటీలు, ఐఐఎస్‌సీ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. డేటా సైన్స్, రోబోటిక్స్ ఏఐ వంటి అధునాతన కోర్సులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్లకు కంపెనీల్లో మంచి గుర్తింపు ఉంది. దాదాపు 92శాతం మంది హెచ్‌ఆర్‌ నిపుణులు ఈ సర్టిఫకెట్లను అంగీకరిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

స్కిల్‌ ఇండియా డిజిటల్‌ 

చదువుతోపాటు నైపుణ్యం కూడా ముఖ్యమని భావించే వారి కోసం స్కిల్ ఇండియా డిజిటల్‌ హబ్‌(SIDH)అందుబాటులో ఉందిఇక్కడ ఏఐ ఆధారిత సీవీ బిల్డర్‌ వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. డిజిట్‌ మార్కెటింగ్ నుంచి ఆటోమోటివ్‌ రంగం వరకు ఎన్నో కోర్సులను నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకున్న వారికి నేరుగా అప్రెంటీస్‌షిప్‌, ఉద్యోగ అవకాశాల సమాచారం కూడా లభిస్తుంది. 

నేషనల్‌ డిజిటల్ లైబ్రరీ

ఏదైనా విషయంపై లోతైన పరిశోధన చేయాలని ఉంటే నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా మంచి వేదిక. ఇక్కడ కోట్లాది ఈ బుక్స్‌, థీసిస్‌లు, వీడియోలు ఉచితంగా లభిస్తాయి. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయోగకరం. 

ఈ ప్లాట్‌ఫామ‌లను ఎలా ఉపయోగించుకోవాలి?

ఈ వెబ్‌సైట్‌లలో రిజిస్టర్‌ చేసుకోవడం చాలా సులభం. మీ ఈమెయిల్ లేదా,మొబైల్‌ నంబర్‌తో లాగిన్ అయ్యి, మీకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు. మొబైల్‌ యాప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా పాఠాలు చదువుకునే వెసులుబాటు ఉంది. ప్రతి మూడు నెలలకొకసారి కొత్త కోర్సులు ఇక్కడ చేరుతుంటాయి. 

Frequently Asked Questions

భారత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏయే ఉచిత ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ లను అందుబాటులోకి తెచ్చింది?

భారత ప్రభుత్వం స్వయం, దీక్ష, ఈ పాఠశాల, ఎన్పీటీఈఎల్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వంటి అనేక ఉచిత ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ లను అందుబాటులోకి తెచ్చింది.

స్వయం (Swayam) ప్లాట్‌ఫామ్ లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?

స్వయం ప్లాట్‌ఫామ్ లో 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ వంటి అనేక విభాగాల్లో 18,500 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పాఠశాల విద్యార్థుల కోసం ఏయే పోర్టల్స్ ఉపయోగపడతాయి?

పాఠశాల విద్యార్థుల కోసం దీక్ష మరియు ఈ పాఠశాల పోర్టల్స్ ఉపయోగపడతాయి. దీక్షలో ఎన్సీఈఆర్టీ సిలబస్ కు సంబంధించిన డిజిటల్ పాఠ్యపుస్తకాలు, వీడియోలు, క్విజ్ లు 15 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

ఎన్పీటీఈఎల్ (NPTEL) ప్లాట్‌ఫామ్ ఎవరికి ఉపయోగపడుతుంది?

టెక్నికల్ విద్యపై ఆసక్తి ఉన్నవారికి ఎన్పీటీఈఎల్ ఒక వరం. ఐఐటీలు, ఐఐఎస్సీ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. డేటా సైన్స్, రోబోటిక్స్, ఏఐ వంటి అధునాతన కోర్సులు ఇక్కడ లభిస్తాయి.

ఉచిత ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ లను ఎలా ఉపయోగించుకోవాలి?

ఈ వెబ్ సైట్లలో మీ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. మీకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు మరియు మొబైల్ యాప్ ల ద్వారా ఆఫ్ లైన్ లో కూడా పాఠాలు చదువుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget