Mango Myths : మామిడి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Mangoes and Weight Gain : మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారనేది చాలామంది చెప్తారు. అయితే పోషకాలతో నిండిన మామిడి పండు తింటే నిజంగానే బరువు పెరుగుతారా? అసలు నిజం ఏంటి?

Mangoes Cause Weight Gain : సమ్మర్ సీజన్‌కి ఇంకో పేరు మ్యాంగో సీజన్ అని చెప్పొచ్చు. ఎండవల్ల ఎన్ని ఇబ్బందులు పడినా.. అలా మామిడి పండు తింటే.. ఎండ వల్ల కలిగిన ఇబ్బందులన్నీ మరచిపోతారు. ముఖ్యంగా కొందరు మ్యాంగోల కోసం సమ్మర్ రావాలని ఎదురు చూస్తారు. టేస్టీగా ఉండే ఈ మామిడి పండ్లలో పోషకాలు కూడా మంచిగానే ఉంటాయి. అయితే అసలైన సమస్య ఏంటి అంటే.. మ్యాంగోలు తింటే బరువు పెరుగుతారని. పాపం ఈ రీజన్‌తోనే కొందరు మ్యాంగోలను పూర్తిగా దూరం పెట్టేస్తారు. కానీ దీని వెనుక ఉన్న నిజం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.
మామిడి పండులోని పోషకాలు ఇవే..
మామిడి పండులో విటమిన్ సి, విటిమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ కూడా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి అవసరమైన పోషకాలే. 100 గ్రాముల పండిన మామిడి పండును మీరు తీసుకుంటే.. దానిలో కేలరీలు 60 నుంచి 70 ఉంటాయి. కార్బ్స్ 15 గ్రాములు ఉంటాయి. వీటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఇవి సహజమైన షుగర్సే. ఫైబర్ 1.5, ఫ్యాట్ 0.5 గ్రాముల కంటే తక్కువ, ప్రోటీన్ 0.8 గ్రాములు ఉంటుంది.
మామిడి పండు తింటే కలిగే లాభాలివే..
మామిడి పండును తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి.. శరీరాన్ని ఇతర సమస్యలనుంచి కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్కిన్ హెల్త్‌కి, కంటి చూపునకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సహజంగా ఎనర్జీని పెంచుతుంది. సమ్మర్లో శక్తి, స్టామినా ఊరికే తగ్గిపోతుంది. అలాంటి వారు మ్యాంగో తింటే రిఫ్రెష్ అవుతూ.. శక్తిని పొందవచ్చు.
బరువు పెరగడానికి అసలైన రీజన్ ఇదే..
కేలరీలు, ఇతర పోషకాలు అన్ని తక్కువ మోతాదులోనే ఉన్నా కూడా బరువు పెరగడానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేంటంటే.. మ్యాంగోలను లిమిటెడ్‌గా తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొందరు వాటిని ఓ ఉద్యమంలాగా తీసుకుంటారు. భోజనం చేస్తూ మూడు, నాలుగు మామిడి పండ్లు లాగించేస్తారు. లేదా ఇతర ఫుడ్స్‌తో కలిపి దానిని తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగిపోతారు.
నిజానికి మామిడి పండ్లు మంచి రుచిని ఇస్తాయి. అలాగే పోషకాలను కూడా శరీరానికి అందిస్తాయి. కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కేలరీలు పెరిగి.. బరువు కూడా పెరుగుతారు. మీరు నిజంగా బరువు పెరగకుండా మామిడి పండును ఎంజాయ్ చేయాలనుకుంటే తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోద్ది. లేదు మ్యాంగోలను చూస్తే కంట్రోల్ చేసుకోవడం కష్టమే అనుకున్నారో.. మీరు బరువును తగ్గించుకోవడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మామిడి పండ్లను ఎవరైనా సరే మూడు, నాలుగు ఒకేసారి తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. బరువు తగ్గాలని లేదా లో కార్బ్ డైట్లో ఉన్నవారు కూడా మామిడిని తక్కువగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే షుగర్, హెవీ క్రీమ్స్ వంటివాటితో కలిపి ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు చిన్నది ఓ మామిడి పండు తీసుకుంటే మంచిది. మీ కేలరీలను బ్యాలెన్స్ చేస్తూ కూడా వీటిని డైట్లో తీసుకోవచ్చు. మ్యాంగోనే కాదు ఏదైనా ఎక్కవ మోతాదులో తీసుకుంటే బరువు కచ్చితంగా పెరుగుతారు.






















