Bottle Gourd Benefits : సమ్మర్లో సొరకాయ తింటే ఎంత మంచిదో తెలుసా? హైడ్రేషన్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
Bottle Gourd : సొరకాయను కచ్చితంగా సమ్మర్ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరతాయని చెప్తున్నారు.

Bottle Gourd Benefits in Summer : సమ్మర్లో కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్‌లో సొరకాయ ఒకటి. ఎందుకంటే దీనిలో నీటి శాతం అధికంగా ఉండడంతో పాటు.. కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు నిండుగా ఉంటాయి. అందుకే దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా సమ్మర్లో వచ్చే కొన్ని సమస్యలను దూరం చేసి.. మంచి ఫలితాలు ఇస్తుంది. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరి సొరకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హైడ్రేషన్
సొరకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అందుకే సమ్మర్లో దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. నీటితో పాటు దీనిని డైట్లో చేర్చుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. డీహైడ్రేషన్ సమస్యలు రావు.
వేడి తగ్గుతుంది..
సమ్మర్లో చాలామంది శరీరం నుంచి వేడి ఎక్కువగా విడుదల అవుతుంది. ఆ సమయంలో సొరకాయను తీసుకుంటే.. దానిలోని నీటి శాతం హైడ్రేషన్‌ని అందించి.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శరీరాన్ని సహజంగా చల్లారుస్తుంది. వేడి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని, పింపుల్స్‌ని అదుపు చేస్తుంది.
కాలేయ సమస్యలు దూరం
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే సొరకాయను డైట్లో చేర్చుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. మొత్తం కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. సహజంగా కాలేయాన్ని శుభ్రపరిచే లక్షణాలు దీనిలో ఉన్నాయి కాబట్టి కాలేయ సమస్యలు రాకూడదనుకునేవారు.. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నవారు కూడా తమ డైట్లో దీనిని తీసుకోవచ్చు.
బరువు తగ్గడం..
బరువు తగ్గాలని డైట్ చేసేవారు తమ డైట్లో సొరకాయను చేర్చుకోవచ్చు. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సాహించి.. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
డయాబెటిస్ నిర్వహణ
మధుమేహమున్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవడానికి దీనిని డైట్లో తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ జీర్ణక్రియకు మద్ధతునిచ్చి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. గ్లెసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అధిక ఫైబర్, నీటి కంటెంట్ రక్త ప్రసరణను మెరుగుపరిచి.. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. ఇది గుండెను రక్షించడంలో హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు బీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జీర్ణ సమస్యలు దూరం
సమ్మర్లో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో జీర్ణ సమస్యలు ఒకటి. వేడివల్ల చాలామంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడతారు. సొరకాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి.. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్ధతునిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపి మూత్ర నాళ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
స్కిన్ సమస్యలు మాయం
సొరకాయలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. సమ్మర్లో శరీరం డీహైడ్రేట్ కాకుండా చేసి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. మెరిసే చర్మాన్ని అందించి.. లోపలి నుంచి పోషణ అందిస్తుంది.
మరిన్ని లాభాలు
వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దూరం చేయడంలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. స్ట్రెస్‌ను తగ్గించి.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కమాల పెరుగుదలను నివారిస్తాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే దీనిని రెగ్యులర్‌గా డైట్లో తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీనిని కూర రూపంలో, సలాడ్స్ రూపంలో, లేదా జ్యూస్ చేసుకుని కూడా డైట్లో తీసుకోవచ్చు.






















