పోషకాలతో నిండిన సొరకాయను జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. సొరకాయ జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువ. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. ఫైబర్ కడుపునిండేలా చేసి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. పైగా కేలరీ తక్కువ. బరువు తగ్గేవారికి ఇది చాలా ఆప్షన్. శరీరంలో ఎక్కువైన నీటిని తగ్గించి స్లిమ్ లుక్‌ని ఇస్తుంది. బరువు తగ్గిన ఫీల్ వస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గించి టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను దూరం చేస్తుంది. రెగ్యులర్‌గా సొరకాయ జ్యూస్ తాగితే బీపీని కంట్రోల్ చేసి హెల్తీగా ఉండడంలో సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండె సమస్యలను దూరం చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా హెల్ప్ చేస్తుంది. స్కిన్ హెల్త్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.