చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుందంటే.. ఐస్‌క్రీమ్‌ను చాలామంది వేసవికాలంలో తింటారు. కానీ వింటర్లో దీనిని తింటే మంచిదా? కాదా? ఐస్ క్రీమ్‌ను చలికాలంలో కంఫర్ట్ డిజెర్ట్గా కూడా తీసుకోవచ్చని చెప్తున్నారు. కానీ కొన్ని ఫాలో అవ్వాలట. చలికాలంలో జలుబు, ఫ్లూ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో చల్లని ఫుడ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. జలుబు ఉన్నప్పుడు మీరు ఐస్ క్రీమ్ తింటే ఫ్లూ లక్షణాలతో పాటు గొంతు నొప్పి కూడా పెరుగుతుంది. వింటర్లో వచ్చే జీర్ణ సమస్యలను ఐస్‌క్రీమ్ మరింత పెంచుతుంది. కడుపు ఉబ్బరం, నొప్పి రావొచ్చు. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం మరింత ఎక్కువ అవుతుంది. ఐస్ క్రీమ్ తినాలనుకుంటే.. వార్మర్, స్పైసర్ ఫ్లేవర్స్‌ను తీసుకోవచ్చు. దాల్చిన చెక్క, జాజికాయ, అల్లం ఫ్లేవర్స్ తినొచ్చు. ఐస్ క్రీమ్‌ని స్లోగా తినాలి. లేకుంటే ఇది బ్రెయిన్‌ని ఫ్రీజ్ చేసి.. జీర్ణ సమస్యలు పెంచుతుంది. హాట్ చాక్లెట్, కాఫీ, టీ వంటి వాటితో కలిపి మీరు ఐస్‌క్రీమ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ మోతాదులో ఐస్‌క్రీమ్ తీసుకుంటే మంచిది. ఎంత ఇష్టమైనా దానిని తక్కువగానే తినాలి.