కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మన పర్సనల్ రీజన్స్ లేదా అవతలి వ్యక్తి ప్రవర్తన కారణం కావొచ్చు.

కోపం వచ్చినప్పుడు తెలిసో తెలియకో నోరు జారుతూ ఉంటాము. ఇష్టమైన వారిని కూడా కష్ట పెట్టేస్తాము.

తర్వాత తీరిగ్గా మనమే ఫీల్ అవుతాము. అలా అవ్వకుండా ఉండాలంటే మనమే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.

మీకు ఎవరిమీదైనా కోపం వస్తే వెళ్లి వర్క్​అవుట్స్ చేయండి. కోపాన్ని పాజిటివ్​గా మార్చుకోగలిగే బెస్ట్ ఆప్షన్ ఇదే.

అవతలి వ్యక్తి మీరు చెప్పే మాట వినకపోతే.. సైలెంట్​గా ఓ స్మైల్​ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోండి.

కోపంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేందుకు ట్రై చేయండి. దీనివల్ల మీరు ఎదుటివ్యక్తిని హర్ట్ చేయలేరు.

పిల్లలతో లేదా నచ్చినవారితో టైమ్ స్పెండ్ చేయండి. దీనివల్ల కోపం కంట్రోల్​ అయ్యి కామ్ అయిపోతారు.

మ్యూజిక్ వినండి. కోపం వచ్చినప్పుడు ప్లే లిస్ట్ ఓపెన్ చేసి ఓ సాంగ్ వినండి. అది మూడ్​ని మార్చగలదు.

యోగా, మెడిటేషన్, డీప్ బ్రీత్ వంటివి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో బాగా హెల్ప్ చేస్తాయి.

ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.