బాదం తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఫెర్టిలిటీ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందట.

ఆల్మండ్స్​లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్పెర్మ్, ఎగ్స్​ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

మెగ్నీషియం, జింక్, సెలెనియం వంటివి స్పెర్మ్ క్వాలిటీ, గ్రోత్​ని పెంచుతాయి.

బాదంలోని హెల్తీ ఫ్యాట్స్, మోనోశాచ్యూరేటెడ్ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్​ను మెరుగుపరుస్తాయి.

ఆల్మండ్స్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రిప్రొడెక్టివ్ సిస్టమ్, ఫెర్టిలిటిని ఇంప్రూవ్ చేస్తుంది.

బాదంలో ఫోలెట్​, విటమిన్ బి ఉంటుంది. ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే పిండం పెరుగుదలకు మంచిది.

రోజుకు గుప్పెడు బాదంను తీసుకోవచ్చు. కానీ ఒకేసారి కాకుండా రోజుకు రెండు మూడుసార్లుగా తినొచ్చు.

ఓట్​మీల్​, యోగర్ట్​లో కలిపి తీసుకుంటే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.

బాదంని నానబెట్టి.. నీళ్లు వేసి బ్లెండ్ చేసి.. వాటిని పాలుగా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.