హెన్నాను చాలామంది జుట్టుకు రంగు, పోషణకోసం అప్లై చేస్తూ ఉంటారు. అయితే దీనినిలో ఏమేమి కలిపి తలకు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసా? మీ జుట్టు షార్ట్ ఉంటే1 కప్పు, మీడియం అయితే 1.5 కప్పులు, పొడుగు అయితే 2 కప్పులు తీసుకోవాలి. లెమన్ జ్యూస్, యాపిల్ సైడర్ వినెగర్ లేదా టీ డికాక్షన్ను కలిపి పేస్ట్‌గా చేసుకోవచ్చు. 1 కప్పు హెన్నా పౌడర్ తీసుకుంటే.. 1 కప్పు ఈ లిక్విడ్ తీసుకుని వేసి కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌లో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, దాల్చినచెక్క పొడి వేసి కూడా పేస్ట్‌గా చేసుకోవచ్చు. వీటిని వేసుకోవడం వల్ల జుట్టుకు మరింత పోషణ అంది.. డ్రై హైయిర్ తగ్గి కండీషనింగ్ అందుతుంది. కుదుళ్ల నుంచి జుట్టుకు అప్లై చేయాలి. జుట్టును రెండు భాగాలుగా విభజిస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. హెన్నా అప్లై చేశాక షవర్ క్యాప్, ప్లాస్టిక్ బ్యాగ్, వార్మ్ టవల్ చుట్టుకుంటే మంచిది. జుట్టు రంగు రావాలంటే.. రెండు లేదా మూడు గంటలు ఉంచాలి. పోషణ కోసం గంట ఉంచితే సరిపోతుంది.